ప‌వ‌న్ పొలిటిక‌ల్ షో ముగింపు... కొత్త సినిమాకు సైన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-08 12:29:44

ప‌వ‌న్ పొలిటిక‌ల్ షో ముగింపు... కొత్త సినిమాకు సైన్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అని ఇటు పార్టీ నేత‌ల‌తో పాటు అటు అభిమానులు కూడా ఎంతో అనుమానంగా ఉంటారు. ఇక మ‌రికొంత మంది అయితే అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌లు ప్ర‌ణాళిక‌లో ఉన్నారా లేదా అని భావిస్తున్నారు. ఈ అనుమానాల‌ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో పార్టీ త‌రపున హ‌డావిడి చేస్తున్న ప‌వ‌న్  పోరాటయాత్ర పేరుతో ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. 
 
జ‌న‌సేన పార్టీని స్థాపించి ఇప్ప‌టికే ఐదు సంవ‌త్స‌రాలు అయింది. కానీ ఇంత‌వ‌ర‌కు ఒక రూపం కూడా దాల్చ‌లేదు. మొదట్లో అయ‌న అన్ని పార్టీ ల‌కు వ్య‌తిరేకంగా స్థాపించిన పార్టీ జ‌న‌సేన అని, కానీ 2014లో బీజేపీ, టీడీపీలకు భ‌జ‌న చేసి కాలం గ‌డిపారు. ఇక ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ మిత్ర‌ప‌క్షాల‌కు గుబై చెప్పి గ‌త నాలుగు నెల‌ల‌నుంచి ప్ర‌జ‌ల‌ప‌క్షాన  పోరాట యాత్ర పేరుతో పోరాట యాత్ర చేస్తున్నారు. 
 
ఈ పోరాట యాత్ర‌లో ప‌వ‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. పార్టీ నాయ‌కులు ప‌లు ప్రాంతాల్లో భారీ బ‌హిరంగ‌స‌భ‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు మొద‌ట్ల‌నేమో అధికారం కావాల‌న్నారు, ఆ త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రి అవుతాను అన్నాడు. తిరిగి మ‌ళ్లి తాను అధికారం కోసం యాత్ర చేయ‌లేదంటున్నారు. ఇక ఆపై జాక్ పాట్ ముఖ్య‌మంత్రి అయిపోతా అని ప్ర‌క‌టించారు.
 
ఇలా ప్ర‌తీ రోజు స‌భ‌ల్లో త‌న‌కు న‌చ్చిన రీతిలో ఒక ప్ర‌క‌ట‌న చేసుకుంటూ పోతున్నారు పీకే. ఇక ఇప్పుడు ప‌వ‌న్ కు గ్ర‌హాలు స‌రిగ్గా స‌హ‌క‌రించ‌లేదో ఏమో తెలియ‌దుకానీ తిరిగి సినిమాల మీద క‌న్నేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో జ‌న‌సైనికులు కంగుతింటున్నారు. గ‌తంలో సినిమాల‌కు గుబై చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు మళ్లీ సినిమాల‌వైపు చూడ‌టం ఏంట‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు. 
 
అంతేకాదు ఒక భారీ ప్రాజెక్ట్ లో న‌టించ‌డానికి ప‌వ‌న్ సైన్ కూడా చేశార‌ట‌. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఎందుకంటే మ‌రికొద్ది రోజుల్లో ఏపీలో ర‌స‌వ‌త్త‌రంగా సార్వత్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఎన్నిక‌లు ముగిశాక ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
అయితే ఇప్ప‌టికే స్క్రీప్ట్ వ‌ర్క్ కూడా ద‌రిదాపు ఖాయం కావ‌స్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిని బ‌ట్టి చూస్తుంటే ఎన్నిక‌ల‌ త‌ర్వాత ప‌వ‌న్ సినిమాల‌కు స‌మ‌య‌త్నం అవుతార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఎన్నిక‌ల వ‌ర‌కు అయినా ఆగుతారా లేక ఎన్నిక‌ల ముందు పొలిటిక‌ల్ షోకు గుబై చెప్పి మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా అని ఆస‌క్తిక‌రంగా మారుతోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.