లోకేశ్ కు ప‌వ‌న్ సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:51:36

లోకేశ్ కు ప‌వ‌న్ సంచ‌ల‌న స‌వాల్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ అధికార బ‌లంతో అడ్డ‌దారిలో ఎమ్మెల్సీ అయ్యార‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్యట‌నను ముగించుకుని విశాఖ ప‌ట్నానికి ప్ర‌యాణించిన ప‌వ‌న్... అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ మ‌రోసారి ఏపీ స‌ర్కార్ కు ప‌ట్టిన దుమ్మును దులిపేశారు. చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో రాష్ట్రానికి తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. అధికార బలంతో ముఖ్య‌మంత్రి ఆయ‌న కుమారుడు ఎక్కడ చూసినా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు.
 
కేవ‌లం టీడీపీ ప్రోత్సాహంతో నారాలోకేశ్ అడ్డ‌దారిలో మంత్రి అయ్యార‌ని ఆయ‌న‌కు ద‌మ్ముంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేసి గెల‌వాల‌ని ప‌వ‌న్ స‌వాల్ విసిరారు. ఆయ‌న పోటీ చేసిన చోట జ‌న‌సేన పార్టీ త‌ర‌పున త‌న కార్య‌క‌ర్త‌ను పోటీకి దింపి గెలుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను ప్ర‌జా స‌మ‌క్షంలో విసిరిన స‌వాల్ ను లోకేష్ కు స్వీక‌రించే ద‌మ్ము ఉందా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అవినీతిలేని ప‌రిపాల‌న చేస్తార‌ని భావించి త‌ను ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపాన‌ని కానీ టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే అధిక‌ సంఖ్య‌లో అవినీతి అక్ర‌మాలకు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇందులో ముఖ్యంగా విశాఖ టీడీపీ నాయ‌కులు భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌వన్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.