సంచ‌ల‌నం టీడీపీ నాయ‌కుల అవినీతిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టిన‌ ప‌వ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 16:04:17

సంచ‌ల‌నం టీడీపీ నాయ‌కుల అవినీతిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టిన‌ ప‌వ‌న్

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత మొద‌టి సారిగా ఎన్నిక‌లు జ‌రిగితే  ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీ జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌కార‌ణం అని రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఇక 2019 ఎన్నిక‌లు ద‌గ్గర‌కు వస్తున్న త‌రుణంలో కొద్దిరోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుంటూరులో జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ స‌భ‌లో ఎవ‌రు ఊహించ‌ని రీతిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అలాగే ఆయ‌న కుమారుడు మంత్రి నారాలోకేశ్, టీడీపీ ఎమ్మెల్యేలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విచ్చ‌ల‌విడిగా అక్ర‌మంగా ఆస్తులను సంపాదించుకున్నార‌ని చెప్పి టీడీపీ నాయ‌కుల‌ను షాక్ కు గురిచేశారు పవ‌న్. అంతేకాదు వారు చేసిన అవినీతిపై త‌న‌ద‌గ్గ‌ర సాక్ష్యాల‌తో స‌హా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఆ త‌ర్వాత నుంచి ప‌వ‌న్ జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రజా పోరాట యాత్ర పేరిట ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పోరాట యాత్ర ముందుగా ఉత్తారాంధ్ర శ్రీకాకుళం నుంచి ప‌వ‌న్ మొద‌లు పెట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప‌రిపాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. 
 
టీడీపీ నాయ‌కులు కేవ‌లం అమ‌రావ‌తిలోనే అభివృద్ది చేస్తున్నార‌ని ఉత్తరాంధ్ర, రాయ‌ల‌సీమ‌లో అభివృద్ది చేయ‌డంలేద‌ని  విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ పోరాట యాత్రకు బ్రేక్  ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా పార్టీ నిర్ణ‌యం మేర‌కు తిరిగి పోరాట యాత్ర‌ను త్వ‌రలో మొద‌లు పెడ‌తార‌ని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒక లేఖ విడుద‌ల చేశారు
 
ఇక ఈ పోరాట యాత్ర మొద‌లుపెడుతున్న త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు. 2014 నుంచి టీడీపీ ప్ర‌భుత్వం కేవ‌లం అమ‌రావ‌తిలోనే అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేసి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. అంతేకాదు టీడీపీ నాయ‌కులు అధికార బ‌లంతో విశాఖ‌లో ఎక్క‌వ భూ క‌బ్జాలకు పాల్ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.