చంద్రబాబును నమ్మొద్దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:53:19

చంద్రబాబును నమ్మొద్దు

2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఎన్నికలలో టీడీపీ ఇచ్చిన హామీలకు నాది బాధ్యత, టీడీపీని గెలిపించండి అని ప్రచారం చేశారు ఆయన. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రశ్నించకుండా వత్తాసు పలికేవారు పవన్.
 
కానీ కొద్దీ నెలల క్రితం ప్లేట్ ఫిరాయించి జనసేన పార్టీ ప్లీనరీలో టీడీపీ చేస్తున్న అక్రమాలపైనా, టీడీపీ నాయకులపైనా, మంత్రి లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు... ఆ రోజు నుండి టీడీపీ వైఫల్యాలను విమర్శిస్తూ, చంద్రబాబుపైనా కూడా విమర్శలు చేశారు.
 
ఇది ఇలా ఉంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సురంగిరాజావారి మైదానంలో పోరాట యాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు జనసేన అధినేత.. అధికారంలోకి రావడానికి ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని టీడీపీపై మండిపడ్డారు.
 
విదేశీ పర్యటనల పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు..పూర్తి క్యాబినెట్‌తో సహా విదేశాలకు వెళ్లినా కూడా రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది...కానీ మీరు ప్రతి విదేశీ పర్యటనకి ప్రత్యేక విమానంలో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్... చంద్రబాబును నమ్మొద్దు... ఆయన తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.