దసరా సమయాన పవన్ కీలక నిర్ణయం..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan
Updated:  2018-10-09 17:07:51

దసరా సమయాన పవన్ కీలక నిర్ణయం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని బలోపేతం కోసం ప్రజా సమస్యలపై అవగాహన కోసం ప్రజా పోరాట యాత్ర అంటూ పవన్ ఇప్పటికే ఉత్తరాంధ్ర పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర చేయబోతున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.. 

ఈ క్రమంలో రాజమండ్రి బ్రిడ్జి పై  జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ మరియు అభిమానులు కవాతు చేయడానికి రెడీ అవగా అది ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. అయితే పవన్ ఇప్పుడు మరో మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు..  దేవి నవరాత్రుల సందర్భంగా పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్షను చేపట్టి నవరాత్రులలో తొమ్మిది రోజులు కఠిన ఉపవాస దీక్ష ప్రారంభించబోతున్నట్లు చెప్తున్నారు..

ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ఇదే నిజమని అంటున్నారు కొందరు. ఈ తొమ్మిది రోజులు పవన్ కేవలం పాలు కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఒకవైపు ఉపవాస దీక్షను కొనసాగిస్తూనే తన ప్రజా పొటాట యాత్రను కొనసాగించబోతున్నాడు.దీనికితోడు పవన్ రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై తన అభిమానులతో కలిసి చేయబోతున్న కవాత్ ప్రదర్శన ద్వారా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలని పవన్ 'జనసేన' భారీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి భారీ ప్రదర్శనలు చేస్తూ మరొకవైపు కఠిన ఉపవాస దీక్షలో పవన్ రాబోతున్న తొమ్మిది రోజులు నిష్టగా ఉంటే ఇంత శారీరక ఒత్తిడిని పవన్ తట్టుకోగాలడా అన్న టెన్షన్ లో పవన్ వీరాభిమానులు ఉన్నారు.

ప్రస్థుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్న పవన్ తాను ముఖ్యమంత్రి అయితే ఒక్క రూపాయి కూడ జీతంగా తీసుకొను అంటూ ఒకనాడు నందమూరి తారక రామారావు తన తెలుగుదేశం పార్టీ ప్రచారంలో చేసిన ప్రచార ఎత్తుగడను మళ్ళీ పవన్ అనుసరిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ప్రజాపోరాట యాత్ర చేస్తున్న ఉభయగోదావరి జిల్లాలు పవన్ 'జనసేన' భవిష్యత్ కు అత్యంత కీలకంగా మారాయి. రాబోతున్న ఎన్నికలలో కింగ్ మేకర్ అవ్వాలని కలలు కంటున్న పవన్ కు ఈ ఉభయ గోదావరి జిల్లాలలో వచ్చే స్థానాలను బట్టే పవన్ జనసేన భవిష్యత్ ఉంటుంది అని అంటున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.