టీడీపీ ఆనాడు విమ‌ర్శించింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan press meet
Updated:  2018-05-01 05:33:31

టీడీపీ ఆనాడు విమ‌ర్శించింది

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌న‌సేన పార్టీ 2019 ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ తెలిపారు...అయితే తెలంగాణలో పోటీ ప్ర‌ణాళిక‌ను ఆగ‌స్ట్ లో వెల్ల‌డిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు అధినేత‌...ఇక ఈ ఎన్నిక‌ల‌కు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ ప్రణాళిక బ‌ద్దంగా అడుగు వేస్తామ‌ని ప‌వ‌న్ తెలిపారు.. అయితే కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ నేప‌థ్యంలో త‌న  త‌దుప‌రి ప్ర‌ణాళిక‌ను విడుద‌ల చేశారు ప‌వ‌న్.. ఈ రోజు  హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. తాము పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు.. అయితే గ‌తంలో టీడీపీ నాయ‌కులు త‌న‌కు రాజ‌కీయ అనుభ‌వం లేద‌ని అన్నార‌ని గుర్తు చేశారు ప‌వ‌న్.
 
అయితే త‌న‌కు పార్టీ అనుభ‌వం లేకపోయినా కానీ,  ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు గ‌త రెండు ఎన్నిక‌ల్లో పాల్గొన్న అనుభ‌వం ఉంద‌ని అన్నారు.. ఈ అనుభ‌వంతోనే తాను త్వ‌ర‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వెళ్తాన‌ని స్ప‌ష్టం చేశారు... అలాగే  ఈ నెల ప‌ద‌కొండో తేదిన రాష్ట్ర ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు..ఇక దీంతో పాటు పార్టీ వ్యూహ క‌ర్త‌గా దేవ్ ని నియ‌మించారు ప‌వ‌న్ ... త‌మ పార్టీ ప్ర‌జ‌ల పార్టీ అని నిరంత‌రం ప్ర‌జ‌ల‌కోసం కృషి చేస్తామ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.