ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 13:55:30

ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్

శ్రీరెడ్డి తీసుకున్న ఎంచుకున్న విధానం ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఆ టాపిక్ కాస్త డైవ‌ర్ట్ అయ్యి ప‌వ‌న్ వైపు మ‌ళ్లింది.ప‌వ‌న్ పై శ్రీరెడ్డి చాలా దారుణ‌మైన విధంగా ఓ బూతు ప‌ద‌ప్ర‌యోగం చేశారు.. దీనిని తానే ప్ర‌యోగించ‌మ‌న్నాను అని వ‌ర్మ తెర‌పైకి వ‌చ్చాడు..వ‌ర్మ ఇలా చేయించాడు అని శ్రీరెడ్డి ఆడియో టేపు బ‌య‌ట‌ప‌డింది.. ఇక అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వ‌ర్మ‌కి కౌంట‌ర్ ఇచ్చారు..
 
ఇటువంటి నీచ రాజ‌కీయం చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు చేశాడు మీ వెనుక ఉన్న‌వారి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌మ‌ని ఓ వార్నింగ్ ఇచ్చాడు... శ్రీరెడ్డిని ఇందులో పావులా వాడుకున్నారు అని శ్రీరెడ్డికి 20 శాతం త‌ప్పు ఉంటే వెన‌కాల ఉండి చేయించిన మీది 80 శాతం త‌ప్పు అని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఇక దీని వెనుక వైసీపీ ఉంది అని అంద‌రికి ఆస్దాన మీడియా హైలెట్ చేసింది.. అయితే 24 గంటల్లో మెగా ఫ్యామిలీ మొత్తం దీనిపై వివ‌రాలు సేక‌రించి దీని వెనుక ఉన్న‌వారి పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టింది.. అయితే ప‌వ‌న్ నేరుగా ఓ ట్వీట్ సంధించారు.... ఏనాడు పెట్ట‌ని విధంగా ప‌వ‌న్ ట్వీట్ పెట్టి త‌న భావాన్ని కోపాన్ని తెలియ‌చేశారు.. నారా లోకేష్, టీవీ9 రవిప్రకాశ్‌, ఏబీఎన్‌, మరికొన్ని టీడీపీ అనుకూల టీవీ చానళ్లపై పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
కొన్ని టీవీ చానళ్లు పచ్చి వ్యభిచారం చేస్తున్నాయని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు... ప్రత్యేక హోదా ఉద్యమం కంటే ఈ చానళ్లకు ఈ అంశమే ముఖ్యమైపోయిందని విమర్శించారు. చంద్రబాబు గారు మీరు వీటిని కంట్రోల్ చేయరా అని ప్రశ్నించారు.  ఒకప్పుడు దొరలంటే భూస్వాములని…. కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములేనని పవన్ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.. ఈ మీడియాలు చెప్పిందే వేదం పాడిందే నాదం అని విరుచుకుప‌డ్డారు ప‌వ‌న్.
 
గత కొద్ది రోజులుగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగి తనను, తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యకరంగా బూతులు తిట్టించారని మండిపడ్డారు. దానిపై తిరిగి చర్చలు పెట్టి మీ వారి ద్వారా ప్రచారం చేయించారని చంద్రబాబు పై పవన్‌ కల్యాణ్ విరుచుకుపడ్డారు..మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అండగా నిలబడినందుక,  ఏపీ సచివాలయాన్ని వేదికగా చేసుకుని మీ కొడుకూ, అతడి స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మరికొన్ని చానళ్లు, సోషల్ మీడియా ద్వారా నా మీద… నా కుటుంబం మీద నిరవదిక మీడియా అత్యాచారం చేయిస్తున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అలాగే వర్మ అనే దర్శకుడు, టీవీ9 ఓనర్‌ శ్రీనిరాజు, టీవీ9 రవిప్రకాశ్ వీరి ముగ్గురి ద్వారా నారా లోకేష్ అతడి స్నేహితుడు కిలారి రాజేష్‌ కలిసి తనపై చేస్తున్నది చంద్రబాబుకు తెలియదంటే నమ్మాలా అని ప్రశ్నించారు ప‌వ‌న్ ఈ వ్యవహారానికి అవసరమైన 10 కోట్ల రూపాయల డబ్బును టీవీ9 ఓనరే ఇచ్చారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.ఇక టీవీ5 సాంబ‌శివ‌రావు ఆడ‌వారిపై ఎంత దారుణంగా మాట్లాడాడు అలాంటి వ్య‌క్తి మీ త‌న‌యుడు మంత్రిలోకేష్ ను అంకుల్ అని సంభోదిస్తాడు అందుకే అత‌న్ని ఇంకా తొల‌గించ‌లేదు లోకేష్ కు అత‌నికి సంబంధం లేదా అని ప్ర‌శ్నించారు ప‌వ‌న్. 
 
ఇంత దారుణంగా ఆస్దాన మీడియా తెలుగుదేశం కలిసి ఇటువంటి కుట్ర‌లు త‌న‌పై చేయ‌డం దారుణం అని ప‌వ‌న్ ఆవేద‌న‌గా ట్వీట్ చేశారు..మొత్తానికి వైసీపీపై మ‌ర‌క వేయాలి అని అనుకుని అడ్డంగా ఇరుక్కున్నారు తెలుగుదేశం నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.