ప‌వ‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 18:42:43

ప‌వ‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు విశాఖప‌ట్నంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 20 వ తేది ఇచ్చాపురం నుంచి బ‌స్సు యాత్ర‌ను చేప‌డ‌తాన‌ని స్ప‌ష్టంచేశారు.
 
ఉత్త‌రాంధ్ర‌ ఉద్య‌మాల‌కు పుట్టినిల్ల‌ని అందుకే తాను శ్రీకాకుళం నుంచి పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. అయితే తాను పోరాటం చేసే ముందు మొద‌టిగా గంగ‌పూజ చేసి బ‌స్సు యాత్ర‌ను చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. ఇక దీంతోపాటు జై ఆంధ్ర ఉద్య‌మంలో ప్రాణాల‌ను కోల్పోయిన వారికి  నివాళులు అర్పిస్తామ‌ని ప‌వన్ వెళ్ల‌డించారు. 
 
ఈ యాత్ర‌లో  ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ వంటి అంశాల‌ను  కేంద్రం ప్ర‌క‌టించ‌నందుకు వ్య‌తిరేకంగా తాను ప‌ర్య‌ట‌న చేయ‌నున్నాన‌ని తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న మొత్తం 17 రోజుల‌పాటు ఉంటుంద‌ని ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌తీ ఒక్క‌రు వారి స‌మ‌స్య‌ల‌ను తన‌కు వివ‌రించాల‌ని ప‌వ‌న్ తెలిపారు.
 
ఇక దీంతో పాటు ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో క‌లిసి కవాతు నిర్వహిస్తామని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. అయితే ఈ క‌వాతు ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఉంటుందని పవన్‌ తెలిపారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భవానికి ముఖ్య‌కార‌ణం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌నందుకేన‌ని అన్నారు. ప్ర‌త్యేక‌హోదా వ‌స్తే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని తెలిసికూడా కొంత మంది పాలకులు నిర్లక్ష్యానికి పాల్ప‌డ్డార‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.