ప‌వన్ గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 17:05:14

ప‌వన్ గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తున్న అలుపెరుగ‌ని పోరాటానికి రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ సంగ‌తి తెలిసిందే.. దీంతో పాటు వైసీపీ నాయ‌కుల‌కు వామ‌ప‌క్షాలు సైతం  మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి..  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం రాజ‌కీయాల‌ను  ప‌క్క‌న‌పెట్టి క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌నే ఉద్దేశ్యంతో వైసీపీ ఎంపీలు చేసిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపామ‌ని అన్నారు..అలాగే ఈ నెల 16 న వైసీపీ నాయ‌కులు చేప‌ట్టే రాష్ట్ర బంద్ కు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు..
 
ఇక తాజాగా వైసీపీ రాష్ట్ర బంద్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు...ఈ రోజు వామ‌ప‌క్షాల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్ త‌న నిర్ణ‌యం తెలిపారు.... వైసీపీకి మ‌ద్ద‌తు తెలుప‌డంతో తాను త‌ల‌పెట్టిన రైతు, కార్మికుల స‌మ‌స్యల‌పై పోరాట‌ కార్య‌చ‌ర‌ణ‌ను వాయిదా వేసుకున్న‌ట్లు మీడియా ద్వారా తెలిపారు... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం తాను ఎవ‌రికైనా మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని అన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తాను భ‌విష్య‌త్ కోసం రాజ‌కీయాలు చేయ‌లేద‌ని, రాష్ట్ర అభివృద్ది కోస‌మే తాను రాజ‌కీయ‌బాట ప‌ట్టాన‌ని అన్నారు...  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తాను ఓ నిస్స‌హాయుడు వ్య‌వ‌హ‌రించ‌డం చాలా అవ‌మానక‌రంగా ఉంద‌ని అన్నారు... ప్ర‌పంచంలో కెళ్ల మ‌న‌దేశం  అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని కానీ పాల‌కులే నిర‌స‌న‌కు దిగ‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని వ్యాఖ్యానించారు... 2014 ఎన్నిక‌ల్లో ప్రజలు బలమైన వ్యక్తిగా భావించి నరేంద్ర మోదీని ఎన్నుకున్నారని, కానీ వారి ఆశలను నెరవేర్చలేకపోయారని ప‌వ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.