వైసీపీని గెలిపించ‌నున్న ప‌వ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 16:48:57

వైసీపీని గెలిపించ‌నున్న ప‌వ‌న్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌డుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఇటు జాతీయ మీడియాలు, అటు రాజ‌కీయ నాయ‌కులు స‌ర్వేల మీద స‌ర్వేలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ స‌ర్వేల‌లో ఒక సారేమో అధికార పార్టీ నెగ్గుతుందని, మ‌రో సర్వేలోనేమో ప్ర‌తిప‌క్ష పార్టీ నెగ్గుతుందని చెబుతున్నారు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా ఈ స‌ర్వేల‌ ప్ర‌కారం అధికార, ప్ర‌తిప‌క్షాల‌కు గెలుపుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు.
 
అయితే ఏపీలో ఆ ఛాన్స్ క‌నిపించ‌డంలేద‌ని కీల‌క స‌ర్వేలు తెలుపుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర కాలం ఉన్న‌ప్ప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక‌ ఈ స‌ర్వే నిర్వ‌హించిన‌ ప్ర‌తీ సారి ప్ర‌తిప‌క్ష వైసీపీనే అన్ని నియోజ‌కవ‌ర్గాల్లో అత్య‌ధిక మెజారిటీతో గెలుస్తుంద‌ని తెలుపుతున్నారు. 
 
ఇక ఇదే అంశాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నాలుగు జిల్లాల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల‌లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత అనే విషయంపై ఇప్పుడు స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వే ప్ర‌కారం 2019 లో టీడీపీకి ప‌వ‌న్ చావుదెబ్బ కొడ‌తాడ‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
2009 ఎన్నిక‌ల్లో కూడా చిరంజీవి త‌న పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసి చంద్ర‌బాబుకు చావుదెబ్బ కొట్టార‌ని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా ప‌వ‌న్ అదే సీన్ రిపీట్ చేస్తార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప‌వ‌న్ ప్ర‌భావంతో టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లాలో కూడా బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.
 
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి సీట్లు గెలిచే స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ గ‌ట్టి ప‌ట్టుతో వుంది.సో.. కేవ‌లం టీడీపీ ఓట్లు మాత్ర‌మే చీలుతాయి. ఇక జ‌గ‌న్ మాత్రం త‌న‌కున్న ఓట్ల‌ను తాను కాపాడుకుంటే చాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక మిగిలిన ఆరు జిల్లాలలో కూడా ఇదే రిపీట్ అవుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.