టీడీపీ నాయ‌కుల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 12:06:30

టీడీపీ నాయ‌కుల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గుంటూరులో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఆయ‌న కుమారుడిపై, అలాగే పార్టీ ఎమ్మెల్యేల‌పై విమ‌ర్శ‌లు చేశారు.. టీడీపీ నాయ‌కులు అధికార అండతో విచ్చ‌ల విడిగా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ పవ‌న్ గుంటూరు స‌భ‌లో మండిప‌డ్డారు.
 
అయితే ఈ క్ర‌మంలో  ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సైకిల్ పార్టీ నాయ‌కులు  విమ‌ర్శిస్తూ  కేంద్రానికి, వైసీపీకి  ప‌వ‌న్ అమ్ముడు పోయి ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు  తెలుగుదేశం నాయ‌కులు... కాగా ఇప్ప‌టికే  చంద్రబాబు నాయ‌కుల‌కు తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్ల‌కు, ప‌వ‌న్ పై  ఎటువంటి కామెంట్లు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు...  ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు కొంత మంది నాయ‌కులు మాత్ర‌మే విన్నారు... కానీ మ‌రికొంత మంది నాయ‌కులు  ఎక్క‌డ మీడియా దొరికితే అక్క‌డ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
అయితే వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా ప‌వ‌న్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ను వేదిక‌గా చేసుకుని టీడీపీ నాయ‌కుల‌పై పోస్ట్ చేశారు... మొన్నటి దాకా తనను టీడీపీ మనిషినని అన్నారని గుర్తు చేసిన పవన్ ఇప్పుడేమో బీజేపీ మనిషినని అంటున్నారని, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనంటూ ట్వీట్ చేశారు ప‌వ‌న్...ఈ రోజు ఉదయం 11.22 గంటలకు పవన్ పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.... దీంతో పాటు రీ ట్వీట్లు కూడా వందల సంఖ్యలో వస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.