మెమొరీ లాస్.. గల్లా పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-21 14:54:55

మెమొరీ లాస్.. గల్లా పై పవన్ సంచలన వ్యాఖ్యలు

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ గురించి పవన్ కళ్యాణ్ ట్విట్ట‌ర్ల వర్షం కురిపించారు...ఈ ట్వీట్లలో బీజేపీ పైన, టీడీపీ పైన ఘాటైన విమర్శలు చేశారు...టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పైన సంచలన ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
 
మోడీ కాళ్ళకి టీడీపీ ఎంపీలు పాదాభివందనం చేసి ఇంకో వైపు పోరాటం అంటే ఎలా నమ్మాలి..? కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మిమల్ని ఇంకా మిత్రులుగా చూస్తున్నారు అని అంటారు. దీనిని బట్టి మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్మాలి..?
 
మెమరీ లాస్ గల్లా, ఇంతకుముందు హోదా వద్దు, ప్యాకేజి ముద్దు అన్నాడు, నిన్న పార్లమెంటులో హోదానే అంత అన్నావు..?
galla jayadev
 
జనసేన ధర్మం వైపే నిలబడుతుంది... 
 
బీజేపీ, టీడీపీ కుమ్మకై ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారు.టీడీపీ నాయకులు ఒక్కసారి నాలుగేళ్లలో మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి.. అప్పుడేమో ప్యాకేజి అన్నారు.. ఇప్పుడు హోదా అంటున్నారు..మళ్ళి మీ స్టాండ్ ని మార్చుకోరు అని ఎలా నమ్మాలి...
pawan
 
ఏపీ అంటే 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీలు కాదు అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం...
 
గ‌జిని సినిమాలో హీరోకి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉన్నట్టు టీడీపీ నాయకులందరికీ షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఎక్కువైంది.
pawan kalyan tweet

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.