చంద్రబాబుకు ప‌వ‌న్ కృతజ్ఞతలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-27 16:18:47

చంద్రబాబుకు ప‌వ‌న్ కృతజ్ఞతలు

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు... టీడీపీ నాయ‌కులు అఖిలప‌క్ష భేటీకి త‌న‌ను పిలిచినందుకు ధ‌న్య‌వాదాల‌ని అన్నారు జ‌న‌సేన‌.... అయితే ఈ అఖిలప‌క్ష భేటీలు రాజ‌ధానిలో ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాద‌ని ఎప్పుడైతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో ఇలాంటి స‌మావేశాలు ఏర్పాటు చేస్తారో అప్పుడే విభ‌జ‌న హామీలు రాష్ట్రానికి నేర‌వేరుతాయ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...అఖిల‌ప‌క్ష భేటీ పేరుతో చంద్ర‌బాబు మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఈ స‌మావేశం తెలుగుదేశం పార్టీ ఎత్తుగ‌డ‌లో భాగ‌మ‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు.. గ‌త‌నాలుగు సంవ‌త్స‌రాలుగా ఎన్డీఏతో మిత్రప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ ఇప్పుడు స‌డ‌న్ గా కేంద్రంతో క‌టీఫ్ చెప్పి మ‌రో కొత్త డ్రామాకు తెర‌లేపుతున్నార‌ని ప‌వ‌న్ అన్నారు...అలాగే తాను చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష భేటీకి హాజ‌రుకాన‌ని స్ప‌ష్టం చేశారు.
 
అయితే దీంతో పాటు ముఖ్య‌మంత్రి గ‌తంలో జరిగిన పుష్కరాలకు అనేక కోట్లు ఖర్చు పెట్టారని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చనిపోతుంటే పట్టించుకోకుండా ఉన్నారన్నారు... ప్రతీ అంశంలో బలమైన వైఫల్యాలను టీడీపీ కనబరుస్తోందని అన్నారు... అలాగే అమరావతి ఏపీ ప్రజలకు సంబంధించిన రాజధానిలా కనిపించడం లేదని, టీడీపీకి సంబంధించిన రాజధానిలా మారిందని ప‌వ‌న్ మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.