జ‌న‌సేన మేనిఫెస్టోతో శుభ‌లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-08-28 11:00:55

జ‌న‌సేన మేనిఫెస్టోతో శుభ‌లేఖ‌

హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు సాధార‌ణంగా ఏం చేస్తారు.. ఆయ‌న సినిమా రిలీజ్ అయితే థియేట‌ర్ ముందు ఫ్లెక్సిల‌ను కట్టి త‌మ అభిమానాన్ని ప్ర‌జ‌లకు చాటుకుంటారు. అలాగే వారి అభిమాని ప‌వ‌న్ ప‌ర్య‌టించిన‌ప్పుడు అరుపులు, కేక‌లు వేస్తూ అభిమానులు త‌మ అభిమానాన్ని చాటుకుంటుంటారు. 
 
ఇది స‌ర్వ సాధార‌ణం కానీ తూర్పుగోదావ‌రికి జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని ఏం చేశారు అంటే ఈ నెల 29న వివాహం చేసుకోబోతున్న నేప‌థ్యంలో త‌న వెడ్డింగ్ కార్డ్ లో 2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన మేనిఫెస్టో పొందుప‌రిచిన అంశాల‌ను ఒక వైపు వెడ్డింగ్ ఇన్విటేష‌న్ అని త‌న అభిమాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోతో ప్రింట్ చేయించాడు. 
 
ఇక ఈ ఆహ్వాన ప‌త్రిక చూసిని ప్ర‌తీ ఒక్క‌రు ఆస‌క్తిగా చూస్తున్నారు. కొంద‌రు అయితే ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ ను అంత‌లా అభిమానిస్తున్న అభిమాని పెళ్లికి ఆయ‌న వ‌స్తే ఎంతో సంతోషంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. చూద్దాం ఇంకా రేప‌టి వ‌ర‌కు టైమ్ ఉంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.