సంచ‌ల‌నం ప‌వ‌న్ పోటీ చేయ‌డం లేదు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-10 10:56:37

సంచ‌ల‌నం ప‌వ‌న్ పోటీ చేయ‌డం లేదు..

హోరాహోరిగా జ‌రుగ‌బోయే సార్వ‌త్రిక ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వైఖ‌రిని బ‌య‌ట‌పెట్టారు. దీంతో పార్టీలో ఉన్న నాయ‌కులకు దాదాపు క్లారిటీ వ‌చ్చింది. పార్టీ త‌ర‌పున ప‌వ‌న్ త‌మ‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపించాల‌ని చూస్తున్న నాయ‌కుల ఆశ‌ల‌ను ప‌వ‌న్ నీరు గార్చారు. ఇక మ‌రికొంద‌రు అయితే పార్టీ స‌మావేశాల్లో ఆందోళ‌న చేప‌డుతున్నారు. 
 
ప‌వ‌న్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని త్వ‌రలో సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పార్టీలోని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయినా కూడా ప‌వ‌న్ త‌న తీరు మార్చుకోలేదు. ఎన్నిక‌లకు సంబంధించి గ‌తంలో ప‌వ‌న్ తెలంగాణ రాష్ట్రంలో 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ఈ స్థానాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల వేట చేసింది.
 
కానీ తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల షెడ్యూల్ ఈ మ‌ధ్య‌కాలంలో విడుద‌ల కావ‌డంతో పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను భ‌రిలోకి దింపే అవ‌కాశం లేకుండా చేశారు ప‌వ‌న్. ఇక ఈ విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన అభిమానులు మండి ప‌డుతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఫ్ల‌కార్డ్స్ ప‌ట్టుకుని తెలంగాణ‌లో కూడా పోటీ చెయ్యాల‌ని ప్ర‌ద‌ర్శించారు. దీనిపై స్పందించి ఆయ‌న తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చెయ్య‌ద‌ని ఎవ‌రికో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.