ఆ మంత్రి బ్లాక్‌మెయిలర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 13:05:24

ఆ మంత్రి బ్లాక్‌మెయిలర్

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక‌ వేధింపులు జ‌రుగుతున్నాయంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని న‌టి శ్రీ రెడ్డి ఒక‌టి త‌ర్వాత ఒక‌టి లీక్ చేస్తూ దేశమంతా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే... ఇక‌ ఇప్ప‌టికే ప్ర‌ముఖ‌ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ త‌న‌తో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ను మీడియాకు అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఈ వ్య‌వ‌హ‌రంలోకి శ్రీ రెడ్డి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అత‌ని త‌ల్లిపై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌రింత దుమారాన్ని రేపింది... అయితే ఈ విష‌యంపై ప‌వ‌న్  సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని వ‌రుస ట్వీట్ ల‌తో క‌ల‌క‌లం రేపుతున్నారు... త‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, అత‌ని కుమారుడు నారా  లోకేశ్ క‌లిసి ఇలాంటి ఆరోప‌లు చేయిస్తున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు...ఇందుకోసం త‌మ‌కు అనుకూల‌మైన మీడియా టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లలో ప్ర‌చారం చేయిస్తున్నార‌ని అన్నారు.
 
త‌న‌ను త‌న త‌ల్లిని టార్గెట్ చేస్తూ రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలతో  తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపిస్తున్నారు అని మండిపడ్డారు. అలాగే మహా న్యూస్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పెట్టుబడులు లేదా ఆయన బినామీలు ఉన్నారని ఆరోపించారు.
 
టీడీపీ అనుకూల పచ్చ మీడియాను టార్గెట్‌ చేసిన ఆయన శనివారం ఉదయం మరిన్ని ట్వీట్లు చేశారు.నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా..? అంటూ ట్వీట్‌ చేశారు. నాకు ఇష్టమైన స్లోగన్ ఫ్యాక్షనిస్టుల ఆస్తుల‌ని  జాతీయం చెయ్యాలి. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి? అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. స్టే ట్యూన్‌డ్‌.. లైవ్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్‌ కళ్యాణ్‌ అంటూ పేర్కొన్నారు.
 
అలాగే ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ అజ్ఞాతవాసిని వాడో బ్లాక్‌మెయిలర్ అని.. స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని ఒకరితో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు ఒకరు ఎవరు... తెలుసుకోవాలనివుందా.. స్టే ట్యూన్‌డ్‌ టు బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం నుంచి - పవన్‌ కల్యాణ్‌ విత్‌ కెమెరా మ్యాన్‌ ట్విట్టర్‌ అని పోస్టు చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.