ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం సీఎం ఇంటిముందు ధ‌ర్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 13:26:28

ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం సీఎం ఇంటిముందు ధ‌ర్నా

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తరుణంలో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కుల‌తో పాటు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా బ‌స్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ మొద‌టిగా ఉద్య‌మాల పురిటిగ‌డ్డ ఉత్త‌రాధ్ర జిల్లాల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌చారంలో ప‌వ‌న్ మ‌రోసారి ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఆ ఎమ్మెల్యేల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయితే కేవ‌లం అమ‌రావ‌తిని మాత్ర‌మే అభివృద్ది చేసి ఉత్త‌రాధ్ర, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లను అమ్మెస్తార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శిచారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విచ్చ‌ల విడిగా విశాఖ‌లో టీడీపీ ఎమ్మెల్యేలు భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. 
 
గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అవినీతి లేని పాల‌న తీసుకువ‌స్తార‌ని భావించి టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని, కానీ టీడీపీ నాయ‌కులే అధిక సంఖ్య‌లో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. అలాగే నాలుగు సంవ‌త్స‌రాల నుంచి విశాఖ రైల్వేజోన్ విష‌యంలో డ్రామాలు ఆడుతున్నార‌ని, ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ప‌వ‌న్‌ విమ‌ర్శించారు. తాను చేసే బ‌స్సు యాత్ర‌కు చంద్ర‌బాబు నాయుడు అడ్డుప‌డితే ఖ‌చ్చితంగా ఆయ‌న ఇంటి ముందు ధ‌ర్నా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.