చంద్ర‌బాబుకు అమితాబ్ చెప్పిన డైలాగ్ క‌రెక్ట్ గా సెట్ అవుతుంది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and cbn
Updated:  2018-11-05 10:54:04

చంద్ర‌బాబుకు అమితాబ్ చెప్పిన డైలాగ్ క‌రెక్ట్ గా సెట్ అవుతుంది..

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై మ‌రోసారి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నాయ‌కులు చేసిన‌ అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు భ‌రించ‌లేక పోతున్నార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అవ‌కాశ రాజ‌కీయాల‌తో పాటు పూట‌కొక మాట మార్చే తెలుగుదేశం పార్టీ నాయ‌కులంటేనే రాష్ట్ర ప్ర‌జ‌లకు విసుగు వ‌చ్చింద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. 
 
ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపాల‌ని ఇక భరించలేక‌పోతున్నామని వ్యాఖ్యానించారు. అయితే ఇదే క్ర‌మంలో తాజాగా బాలీవుడ్ న‌టుడు అమితాబ్ చేసిన ట్వీట్ చేశారు. అది అబ‌ద్దం అని తెలిసి నిజ‌మ‌ని ఇత‌రుల‌ను న‌మ్మించేందుకు వితండ‌వాదం చేసే వారితో దూరంగా ఉండ‌ట‌మే న‌యం వారితో వాద‌న అన‌వ‌స‌రం అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనిపై ప‌వ‌న్ స్పందిస్తూ ఈ కామెంట్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని రీ ట్వీట్ చేశారు.

షేర్ :