వైసీపీకి సంబంధం లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 13:50:46

వైసీపీకి సంబంధం లేదు

శ్రీరెడ్డి అంశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం  తెర‌పైకి రావ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఇదే చ‌ర్చించుకుంటున్నారు..శ్రీరెడ్డి చేత వెన‌క ఉండి చేయించింది మొత్తం వైసీపీ నాయ‌కులు అని ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగుదేశం నాయ‌కులు,  సైకిల్  కేడ‌ర్, తెలుగుదేశం  కార్య‌క‌ర్త‌లు అలాగే ఆస్ధాన మీడియాలు సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు వివిధ ర‌కాలుగా ప్ర‌చారం చేశారు.. ఒకింత వైసీపిని ప‌వ‌న్ విష‌యంలో ఇరుకున పెడ‌దాం అనుకున్నారు.. అయితే చంద్ర‌జ్యోతి మెరుగైన స‌మాజం చానెళ్లు దీని వెనుక ఉండి, మంత్రిలోకేశ్ త‌న స్నేహితుడి ద్వారా ఇటువంటి దారుణ‌మైన చ‌ర్య‌ల‌కు దిగుతున్నాడు అని ప‌వ‌న్ ట్వీట్ పెట్ట‌డంతో ఒక్క‌సారిగా తెలుగుదేశం అడ్డంగా ఇర్కుపోయింది..
 
ఇక వైసీపీ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనేది ప‌వ‌న్ పరోక్షంగా తెలియ‌చేశారు. ఈ విష‌యంలో వైసీపీ పై ఎటువంటి కామెంట్లు పెట్ట‌ద్ద‌ని వైసీపీ నాయ‌కుల‌కు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని జ‌న‌సేన కేడ‌ర్ అంటున్నారు... ఇక కీల‌క స‌భ్యులు కూడా తెలియ‌చేస్తున్నారు.. దీనిపై సాక్ష్యాధారాలు ఆడియో టేపుల‌తో స‌హా అన్ని ప‌వ‌న్ వ‌ద్ద ఉన్నాయి అని అంటున్నారు.. ఇక ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా ఉన్న‌ట్టు నటిస్తూ ఆ సంస్ద ప‌వ‌న్ కు వెనుక నుంచి గొయ్యి త‌వ్వింది అని జ‌న‌సైనికులు మండిప‌డుతున్నారు.
 
ఇక దీని వెనుక ఎవ‌రు ఉన్నారు అనేది ఆయ‌న వెల్ల‌డించే స‌రికి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైసీపీ నాయ‌కులు కూడా దీనిని ఖండిస్తున్నారు, త‌ల్లుల పై కుటుంబాల‌పై వ్యాఖ్య‌లు చేసే నాయ‌కులు తెలుగుదేశంలో ఉన్నారు అని ఇప్ప‌టికే అనేక‌చోట్ల ఇటువంటివి జ‌రుగుతున్నాయి అని వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు, గ‌తంలో తాడిప‌త్రిలో కూడా ఇదే జ‌రిగింది అనేది తెలిసిందే...
 
ఇక వైసీపికి అన్ని ఆపాదించి ప‌వ‌న్ ని రాజ‌కీయంగా డీ గ్రేడ్ చేసి, రాజ‌కీయంగా ల‌బ్ది పొంది వారినుంచి మ‌రో విధంగా లాభం పొంద‌డానికి ఈ మీడియాలు స‌పోర్ట్ చేస్తున్నాయి బాబుకి అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు... మొత్తానికి వైసీపీ కాస్త దీనిపై సైలెంట్ గా ఉంది... ప‌వ‌న్  ఇప్ప‌టికైనా తెలుసుకోవాలి అని, జ‌గ‌న్ మొద‌టి నుంచి ఈ ఆస్ధాన‌మీడియాల‌ని అందుకే నిల‌దిస్తున్నారు అని మ‌రోసారి తెలియ‌చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.