చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-08 01:36:59

చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గ‌తంలో ఆంధ్ర‌రాష్ట్రాన్ని మొత్తం తాక‌ట్టుపెట్టార‌నే ఉద్దేశంతో తెలుగు వారి అత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించార‌ని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గుర్తు చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ సిద్దాంతాల‌ను పార్టీ విలువ‌ల‌ను మ‌రిచి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు రెడీ అవుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు అవ‌స‌రాలను బట్టి రంగు మార్చ‌డంలో ఆయ‌న‌ను మించిన వారు లేర‌ని రామ‌చంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. 
 
గ‌తంలో చంద్రబాబు కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తూ అనేక వ్యాఖ్య‌లు చేశార‌ని, దోచుకోవ‌డ‌మే కాంగ్రెస్ ప‌ని, దోచుకోవ‌డ‌మే కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ ను పాతివెయ్యాలి, దేశానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ను త‌రిమి వెయ్యాలి, త‌ర్వ‌లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ 420 అని ఇలా అనేక‌ విమ‌ర్శ‌లు చేసిన‌ చంద్ర‌బాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తులు పెట్టుకోవ‌డం సిగ్గుగా ఉంద‌ని ఆయ‌న మండిడ్డారు.
 
గ‌తంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్