ఏపీ ముఖ్యమంత్రి సీఎం నారాచంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా పార్టీలోకి తీసుకుని, అక్కడ నుంచి ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక మంత్రిని చేసిన తర్వాత పలు విమర్శలు వచ్చాయి... సీఎం తనయుడు అయ్యి ఉంది ఇలా నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో రాకుండా దొంగచాటుగా వెనుకదారి నుంచి తీసుకోవడం ఏమిటని పలువురు విమర్శలు చేశారు.. అయితే రాజకీయాల్లో విలువలు గురించి చెప్పే చంద్రబాబు దీనికి ఎటువంటి సమాధానం చెప్పలేదు.
ఇక మంత్రిగా లోకేష్ ఎటువంటి ప్రసంగం ఇచ్చినా ఆకంటెంట్ కరెంట్ లా మొత్తం మీడియాలో ప్రసారం అయిపోతూ ఉంటుంది... ఆయన మాటల్లో కంటెంట్ లేదు అని కామెంట్లు వస్తుంటాయి... ఇక ఆయన ఫుల్ ఇంగ్లీష్ మీడియం చదువులు కాబట్టి ఆయన తెలుగులో మాట్లాడటానికి ఓ టీచర్ ను అపాయింట్ చేశారట చంద్రబాబు... ఇది గతంలో అందరికి తెలిసిందే... ఆయన ఎటువంటి మాటలు మాట్లాడాలి స్పీచ్ ఎలా ఇవ్వాలి అనే సలహాలు సూచనలు ఆయన ఇవ్వనున్నారు.. ఆయన పెద్ది రామారావు.. ఆయనకు ప్రభుత్వం భారీ నజరానా అందించింది.
మంత్రి నారా లోకేష్ ప్రసంగాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు సూచించే పెద్ది రామారావుకు లక్ష రూపాయల జీతం, హెచ్ఆర్ఏ కింద 30వేలు, ప్రభుత్వ సలహాదారులతో సమానంగా అన్ని అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ది రామారావుకు ఒక ప్రైవేట్ కార్యదర్శిని, ఒక ప్రైవేట్ అసిస్టెంట్‌ను నియమించుకునే అవకాశం కూడా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మండలి సభ్యుడి హోదాలో ఆయనకు ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించింది.దీంతో ఇప్పుడు ఈ వార్త పెను వార్తగా మారింది.. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు తనయుడి తెలుగు ట్యూషన్ కోసం లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేస్తున్నారు అనేలా విమర్శలు వస్తున్నాయి.
Comments