పుంగ‌నూరులో పెద్దిరెడ్డి తిరుగులేని నాయ‌కుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 18:05:30

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి తిరుగులేని నాయ‌కుడు

రాజ‌కీయనాయ‌కుల్లో ప్ర‌జాధ‌ర‌ణ పొందిన నాయ‌కులు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు. ఒకవేళ‌ ప్ర‌జాధ‌ర‌ణ పొందిన నాయ‌కుడు ఉన్న‌ట్లు అయితే మాత్రం ఆ నాయ‌కుడిని ప్ర‌జ‌లు ఎప్పుడూ మ‌రిచిపోలేరు. ఆయ‌న ఏ పార్టీ నుంచి అయితే  పోటీ చేస్తారో ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ నాయ‌కుడిని మాత్రం గెలిపించుకుంటారు ప్ర‌జ‌లు. ఆయ‌న పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ది కార్య‌క్రమాలు చేయ‌క‌పోయినా కూడా ఆ నాయ‌కుడిని ప్ర‌తీ ఎన్నిక‌ల్లో గెలిపిస్తూనే ఉంటారు. అలా గొప్ప ప్ర‌జాధ‌ర‌ణ పొందిన నాయ‌కులు ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు అందులో ఒక‌రు, పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి.
 
 
ఇరు తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014 సార్వత్రిక‌ ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పెద్ది రెడ్డి పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. దీంతో  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చినా కూడా చంద్ర‌బాబు నాయుడు హ్యాపీగా ఫీల్ అవ్వ‌లేద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఎందుకంటే ఆయ‌న సొంత జిల్లాలో ప‌ట్టు సాధించుకోలేపోయాన‌ని చాలా సార్లు మ‌ద‌న చెందార‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
దివంగ‌త‌నేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న జిల్లాలో టీడీపీ ప‌ట్టు సాధించుకోలేక పోయారు. చివ‌ర‌కు 2014 లో కూడా చిత్తూరులో చంద్ర‌బాబు టీడీపీ ప‌ట్టు సాధించుకోలేకపోయారు. ఇక ఎలాగైనా 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో  టీడీపీ నాయ‌కులు అనేక వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. అందులో ముఖ్యంగా చంద్ర‌బాబు పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పట్టు బిగించాల‌ని ఉద్దేశ్యంతో కొత్త ప్లాన్ వేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ట‌. 
 
తాజా స‌ర్వే ప్ర‌కారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుంగ‌నూరులో ఎన్ని వ్యూహ‌లు ర‌చించినా కూడా ప్ర‌తిఫ‌లం ద‌క్క‌ద‌నే చెబుతున్నారు. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దిరెడ్డికి రోజు రోజుకు ప్ర‌జాధ‌ర‌ణ ఎక్కువగా పెరిగిపోతుంది. అందులో కార్మికులు, క‌ర్ష‌కుల మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడు. పెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ఫండ్స్ ను ఏమాత్రం ఆశించ‌కుండా త‌న సొంత నిధుల‌ను వెచ్చించి ప్ర‌జ‌ల‌కు నిత్య‌వ‌స‌రాలు తీర్చుతున్నారు. పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మండలాల‌కు నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది. నీటి స‌మ‌స్య‌పై వైసీపీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డిని విమ‌ర్శించ‌కుండా కేవ‌లం టీడీపీ నాయ‌కుల‌ను మాత్ర‌మే ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తారు. 
 
రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అనేక చోట్ల అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రిపించారు. ఇక ఇదే విష‌యాన్ని గుర్తుపెట్టుకుని 2019 లో వైసీపీ అధికారంలోకి వస్తే ఖ‌చ్చితంగా త‌మ జిల్లాలో అభివృద్ది చేస్తార‌ని భావించి ప్ర‌జ‌లు పెద్ది రెడ్డికి జేజేలు ప‌లుకుతున్నారు. సో.. చిత్తూరు జిల్లాలో ప్ర‌జాధ‌ర‌ణ‌ పొందిన నాయ‌కుల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మొద‌టి స్థానం ద‌క్కించుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.