పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి మిథున్ రెడ్డి, రోజా టార్గెట్ ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 01:59:05

పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి మిథున్ రెడ్డి, రోజా టార్గెట్ ఇదే

చిత్తూరు జిల్లాలో పార్ల‌మెంట్ నియోజ‌కవ‌ర్గాల‌లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అటు ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు క‌దుపుతున్నారు. కుప్పంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుంగ‌నూరులో పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డిల గెలుపు న‌ల్లేరుపై బండిన‌డ‌కయే అయినా ఎక్కువ మెజార్టీ ల‌క్ష్యంగా పెట్టుకుని పార్టీ కేడ‌ర్ నాయ‌క‌త్వ చ‌మ‌టోడుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నేత‌లు ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాల‌లో అత్య‌ధిక మెజార్టీతోనే పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. కుప్పంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ‌చ్చే మెజార్టీతోనే చిత్తూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీ సునాయాసంగా గెలుస్తోంది. ఇక పుంగ‌నూరు సెగ్మెంట్ లో వచ్చే మెజార్టీని రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి కీల‌కం. 
 
అయితే అధికార ప‌క్షం పుంగ‌నూరుపై గురిపెడితే కుప్పంలో మెజార్టీకి గండి కొట్ట‌డ‌మే వైసీపీ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానాన్ని  గెలుచుకున్న వైసీపీ ఈ సారి చిత్తూరు పైనా క‌న్నేసింది. 2014 ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి కొంత‌మేర మెజార్టీని త‌గ్గించ‌గ‌లిగింది వైసీపీ. ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మెజార్టీని త‌గ్గించ‌గిలితే చిత్తూరులో పాగ వెయవ‌చ్చనే ఆలోచ‌నతో పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు ఏంపీ మిథున్ రెడ్డి రోజా లాంటి నేత‌లు నిరంత‌రం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు.
 
దీంతోపాటు టీడీపీ హాయంలో జ‌రిగిన స్థానిక స‌మ‌స్య‌ల‌ను హైలెట్ చేస్తూ అధికార పార్టీ నాయ‌కుల్లో విభేదాల‌ను వైసీపీకి అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. కుప్పంలో విప‌క్ష పార్టీ దూరుడుతో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షంచి జిల్లా భాద్య‌త‌ల‌ను లోకేశ్ కు అప్ప‌గించ‌డ‌మే కాకుండా ప్ర‌తీ నెలలో ఒక్క‌సారి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరు సెగ్మెంట్ పై ఈ సారి సీరియ‌స్ గా దృష్టి పెట్టారు టీడీపీ అధినేత. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వ‌ర‌కూ పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో టీడీపీకి కంచుకోట‌. 1999లో మిన‌హా పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వ‌ర‌కూ అన్ని ఎన్నిక‌ల్లో ప‌సుపు జెండానే ఎగిరాంది. అయితే నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న‌తో అమ‌ర్నాథ్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంఅయిన పెద్ద‌పంజాని మండ‌లం ప‌లుమ‌నేరులో క‌లువ‌టంతో ఆయ‌న అటు వెళ్లారు. 
 
 ఇదే స‌మ‌యంలో అప్ప‌టి వ‌ర‌కు పీలేరుకుప్ర‌తినిధ్యం వ‌హించిన పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత మండ‌లం స‌దుం పుంగ‌నూరులోకి రావ‌టంతో ఆయ‌న ఇక్క‌డినుంచి భ‌రిలోకి దిగారు పుంగ‌నూరులో సరైన అభ్య‌ర్ధిలేక కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన వెంక‌ట ర‌మ‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే పెద్దిరెడ్డి అంగ‌బ‌లం అర్ధ‌బలం ముందు ఆయ‌న నిల‌బ‌డ‌లేక పోయారు. దీంతో సుమారు 30వేల‌కు పైగా మెజార్టీతో గెలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేక పోవ‌టంతో జిల్లా వైసీపీకి పెద్దిక్కుగా ఉంటున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంగ‌నూరు నుంచి టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్ధిని నిల‌బెట్టేందుకు తీవ్ర‌ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమారెడ్డి సోద‌రుడు కిషోర్ కి పుంగ‌నూరులో ప‌ట్టు ఉన్న రెండు మండ‌లాల భాద్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఇక మ‌రోవైసు మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డితో పాటు జిల్లా అధ్య‌క్షుదు పులివ‌ర్తి నానికి స‌మ‌న్వ‌య భాద్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జ్ వెంక‌ట ర‌మ‌ణ‌రాజుపై టీడీపీ శ్రేణుల్లో వ్య‌తిరేక‌త‌ను పోగొట్టేందుకు పుంగ‌నూరులో అధికార పార్టీ  భారీగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. సోమ‌ల‌,స‌దుం మండ‌లాలో ర్యాలీల‌తో పాటు స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.