వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 15:12:31

వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ?

అధికార పార్టీ పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఫిరాయింపుల విష‌యంలో వైసీపీ పై అదే పందా అనుస‌రిస్తోంది తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రంలో పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని కోరుతున్నా ఎటువంటి ప్ర‌తిస్పంద‌న తెలుగుదేశం నుంచి లేదు... పైగా రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి న‌లుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు తెలుగుదేశం అధినేత..
 
అయితే ఇప్ప‌టికే 22 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారు వైసీపీ నుంచి తెలుగుదేశం ప్ర‌లోభాల‌కు... ప్ర‌జ‌ల నుంచి నాయ‌కుల నుంచి పార్టీల నుంచి ఇంత వ్య‌తిరేక‌త వ‌స్తున్నా తెలుగుత‌మ్ముళ్ల అడ్డగోలు రాజ‌కీయాలు చేస్తూనే ఉన్నారు.
 
తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న‌ని పార్టీ ఫిరాయించాలి అని తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు అని తెలియ‌చేశారు.. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో  మ‌ళ్లీ ఫిరాయింపుల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది.తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. 
 
ఇది వరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్‌లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు.టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు.
 
భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయ‌న విమర్శించారు..... మొత్తానికి తెలుగుదేశం పార్టీ మ‌రింత ప్ర‌జల్లోకి ఫిరాయింపుల‌ను తాము ప్రొత్స‌హిస్తూనే ఉంటాము అని తెలియ‌చేస్తోంది.. ప్ర‌జ‌ల‌కు యువ‌త‌కు రాజ‌కీయాల్లో తెలుగుదేశం ఎటువంటి  సంకేతాలు ఇచ్చేలా ముందుకు వెళుతుందో స‌మాధానం చెప్పాలి అని అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.