అక్ర‌మ అరెస్ట్ ల‌పై పిటీష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

law
Updated:  2018-09-04 03:29:03

అక్ర‌మ అరెస్ట్ ల‌పై పిటీష‌న్

కొద్దిరోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నారా హమారా... టీడీపీ హ‌మారా స‌భ‌లో ఫ్ల‌కార్డ్స్ పట్టుకుని చూపించార‌ని తొమ్మిది మంది ముస్లిం యువ‌కులను స‌ర్కార్ అరెస్ట్ చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈఘ‌ట‌న పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ నేత‌లు అహ‌మ్మ‌ద్ ఇక్బాల్, రెహ‌మాన్, శిల్ప, ర‌వి రాష్ట్ర మానవ హ‌క్కుల క‌మీష‌న్ లో పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక దీనిపై స్పందించిన మాన‌వ‌హ‌క్కుల క‌మీష‌న్ గుంటూరు జిల్లా ఎస్పీకి నోటీసుల‌ను జారీ చేసింది. అంతేకాదు ఈ అక్ర‌మ కేసులో భాగంగా అక్టోబ‌ర్ 22 విచార‌ణ చేప‌ట్ట‌నుంది. అక్ర‌మంగా అరెస్ట్ చేసిన పోలీసుల‌ను సస్పెండ్ చెయ్యాల‌ని అలాగే బాధిత యువ‌కుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని ఈ పిటీష‌న్ లో కోరారు. 

షేర్ :

Comments