బాబుకు ఫోన్ కాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 11:46:57

బాబుకు ఫోన్ కాల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో త‌మ‌కు అన్యాయం జరిగిందంటూ ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా  కోపంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఢిల్లీ నుండి ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 
 
అయితే, ఈ పిలుపు కేంద్ర ప్ర‌భుత్వం నుండి వ‌చ్చిందా.... బీజేపీ పెద్దల‌నుండి వ‌చ్చిందా.. అనే విష‌యంపై సీఎం కార్యాల‌యం స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. ఎవ‌రు పిలిస్తే ఏముంది....అంద‌రూ ఒక‌టే క‌దా అంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌ధ్యంలో  ఏపీ ప్ర‌జ‌లు కేంద్రంపై గుర్రుగా ఉన్నార‌ని అందుకే బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుందామంటూ  కొంద‌రు టీడీపీ నేత‌లు అధినేత బాబుకు  తెగేసి చెబుతున్నారు. 
 
కాని, వ‌చ్చే నెల‌లో పార్లమెంట్ స‌మావేశాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో చివ‌రి ప్ర‌య‌త్నంలో భాగంగా  కేంద్రంపై స‌మావేశాల్లో ఒత్తిడి తీసుకువ‌చ్చాక కూడా ఏపీకి న్యాయం జ‌ర‌గ‌క‌పోతే అప్పుడు తెగ‌దెంపులు చేసుకుందామంటూ మ‌రికొంద‌రు స‌ల‌హా ఇస్తున్నార‌ట‌....ఇలాంటి సందిగ్ధ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో మ‌రి.....!!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.