ప్రతిపక్షనేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్రలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చేరిగారు.... గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పేరేచెర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన వైయస్ జగన్ గత నాలుగు సంవత్సరలుగా చంద్రబాబు నోరు తెరిస్తే పచ్చి అపద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు... 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిని అద్దాలమేడలా నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకూ దాని ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు...
వైసీపీ నేతలు అమరావతి ప్రస్తావన తీసుకు వస్తే అప్పుడు ఇంటర్నెట్లో అద్భుతమైన బిల్డింగ్ ఫొటో ఏదైనా కనపడితే చంద్రబాబు దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని, ఆ తరువాత రోజే ఆ ఫొటోను పత్రికల్లో వేయించుకుని ఇలా రాజధాని నిర్మిస్తామని ఏదో ఒకసాకు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారని జగన్ మండిపడ్డారు. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇంతవరకూ అమరావతిలో ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా నిర్మించలేకపోయారని తెలిపారు.
దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ తమ రాష్ట్రం బాగుండాలని ప్రతీ రోజు దేవున్ని కోరుకుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం ప్రజల గురించి పట్టించుకోకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను తన బినామీలతో కొనుగోలు చేయిస్తున్నారని జగన్ అన్నారు..చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని, రాజధాని పేరుతో వేల ఎకరాలను అక్రమంగా దోచుకుంటున్నారని జగన్ మండిపడ్డారు... విదేశాల్లో అయితే చంద్రబాబులాంటి వారిని జైలులో పెడతారని వైయస్ జగన్ తెలిపారు.
అధికార బలంతో అమరావతి పేరు చెప్పి విదేశాలు తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జగన్ తెలిపారు. ఇప్పటికే జపాన్, అమెరికా, టర్కీ, సింగపూర్ వంటి దేశాలను సందర్శించారని అన్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు తిరిగేది అమరావతి నిర్మాణం కోసం కాదని, అక్రమంగా సంపాదించిన ప్రజల డబ్బును తీసుకెళ్లి అక్కడ దాచుకుంటారని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలో వస్తే విదేశాల్లో టీడీపీ నాయకులు దాచుకున్న డబ్బంతా తిరిగి రాష్ట్రానికి తీసుకోస్తానని వైయస్ జగన్ చెప్పారు..
emira bala raju
emira bala raju