మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 16:37:28

మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

ఎన్టీఆర్ త‌న‌యుడు సినీ న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ, సీఎం చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష స‌మ‌యంలో  ప్ర‌ధాని మోదీ  పై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు బీజేపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు ఫిర్యాదు చేశారు...
 
ఇక మ‌రికొంద‌రు బాల‌య్య గ‌తంలో ఉన్న ప‌రిస్దితిలో ఉన్నారు అని గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.. ఇక బాల‌య్య మాట్లాడిన  హిందీ దేశంలో ఎవ‌రూ మాట్లాడ‌లేర‌ని ఇక సోష‌ల్ మీడియాలో కూడా పోస్టులు స‌ర్క్యులేట్ అవుతున్నాయి..
 
బాల‌య్య వ్యాఖ్య‌లపై ఏ తెలుగుదేశం నేత ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు..దీనిపై మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ తాజాగా స్పందించారు..సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాడిన పదజాలం తప్పేనని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయాలలో మాట్లాడే బాష నాయకులు నేర్చుకోవాలని హితవు పలికారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేంద్రం రాజకీయ కుట్ర చేసే పరిస్థితి ఉందన్నారు.
 
అయితే పితాని వ్యాఖ్య‌ల‌పై తెలుగుదేశం నేత‌లు కూడా కంగుతిన్నారు... మంత్రిగా ఉన్న‌మిగిలిన వారు ఎవ‌రూ దీనిపై స్పందించ‌లేదు అయితే ఈయ‌న బాల‌య్య పై నెగిటీవ్ గా స్పందించ‌డం పై సీఎం ఎటువంటి స్పంద‌న స్పందిస్తారో చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.