బాబు దీక్ష మోదీ ట్వీట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 17:49:09

బాబు దీక్ష మోదీ ట్వీట్ ?

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు దీక్ష చేయ‌డాన్ని బీజేపీ, వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే ...ఇటు బీజేపీ నాయ‌కులు వైసీపీ నాయ‌కులు దొంగ దీక్ష కొంగ జ‌పం అంటూ నిల‌దీస్తున్నారు... అలాగే నాడు మోదీ దీక్ష చేస్తే తప్పు అని పేరు పెట్టిన చంద్ర‌బాబు, ఇప్పుడు ఎలా దీక్ష చేస్తున్నారు. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు ఎలా చేస్తున్నారు అస‌లు ఖ‌జానా ఖాళీగా ఉంది అని చెప్పే తెలుగుదేశం నాయ‌కులు దీక్ష ఎలా చేస్తున్నారు అని సీఎం చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఇక నేడు సీఎం చంద్ర‌బాబు పుట్టిన రోజున, ధర్మ పోరాట దీక్ష చేస్తున్నా అని తెలియ‌చేశారు.. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు నాయ‌కులు సీఎం చంద్ర‌బాబుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.. అయితే ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా సీఎం చంద్ర‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. 
 
ఆయురారోగ్యాలతో ఆయన చిరకాలం చల్లగా ఉండాలంటూ ప్రధాని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మోదీ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా అని పేర్కొన్నారు.
 
మోత్తానికి మోదీ,చంద్ర‌బాబు పుట్టిన రోజుని చూశారు కాని, పుట్టిన‌రోజున చేసే దీక్ష‌ను చూడ‌లేదు అని ఇక్క‌డ తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తోంది....ధర్మ పోరాట దీక్ష 12 గంట‌లు నేడు సీఎం చంద్ర‌బాబు చేస్తున్న విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.