మ‌రోసారి ప‌రువు పోగొట్టుకున్న ప‌చ్చ‌పార్టీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 11:31:47

మ‌రోసారి ప‌రువు పోగొట్టుకున్న ప‌చ్చ‌పార్టీ

ఉసిరికాయ అంత ఉన్నాదానిని ప‌న‌స‌కాయ అంత రాద్దాంతం చేయ‌డం తెలుగుదేశం నాయ‌కులకు ప‌నిగా మారింది, అనే విమ‌ర్శ నాటి నుంచి నేటి వ‌రకూ అంద‌రికి తెలిసిందే.. కంటిలో న‌లుసు తియ్య‌రా అంటే, సీసం పోసిన‌ట్టు చిన్న దానికి పెద్ద నాటిక‌గా మ‌ల్చ‌డంలో త‌మ్ముళ్ల స్ట్రాట‌జీ వేరు.... తాజాగా జ‌గ‌న్ దేశం ప‌రువు, ప్ర‌పంచం ప‌రువు, మొత్తం తీసేశాడు.. ఇక ఏపీ ఎక్క‌డా త‌ల ఎత్తుకోలేదు అని ర‌చ్చ చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
అస‌లు ప్ర‌ధాని మోదీకి జ‌గ‌న్ కేసుల విష‌యంలో నోటీసులు రావ‌డం  ఏమిటి?  ప్ర‌ధాని మోదీనే ఏకంగా ఇరికించిన ప్ర‌బుద్దుడు జ‌గ‌న్ అని కారాలు మ‌ర‌మ‌రాలు నూరుతున్నారు తెలుగు నాయ‌కులు.. తెలుగుదేశం క‌ర‌ప‌త్రిక‌లో ప్ర‌చుర‌ణ‌ల‌కు కూడా ఎక్కువ స్పేస్ అలాట్ అయింది నేడు... అంటే జ‌గ‌న్ పై మ‌ళ్లీ ఎంత విషం చిమ్ముతున్నారో తెలుసుకోవ‌చ్చు ఈ ద‌ళం.
 
ఇందూటెక్ జోన్ ఐటీ సెజ్ లో తాము భారీగా న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాం న్యాయం చేయాలి అని మారిష‌స్ ప్ర‌భుత్వం నెద‌ర్లాండ్స్ లోని, ఆర్బిట్రేష‌న్ కోర్టును ఆశ్ర‌యించింది. ఈ ఇందూటెక్ లో జ‌గ‌న్ శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి ల‌పై సీబీఐ చార్జ్ షీటు దాఖ‌లు చేసింది... దీంతో ఆ ప్రాజెక్ట్ వెన‌క్కి వెళ్లిపోయింది.. 50 మిలియ‌న్ల ప‌రిహారం కావాలి అని ఆ దేశీయ వాద‌న‌.
 
ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి నోటిసులు, అలాగే కేంద్రంలో స‌ద‌రు మంత్రుల‌కు కూడా నోటీసులు అందాయి. అంత‌ర్జాతీయ వాణిజ్య చ‌ట్టం ప్ర‌కారం, ఇరు దేశాల మ‌ధ్య వ‌ర్త‌క ఒప్పందాలు జ‌రిగిన స‌మ‌యంలో వారికి లాభాలు వ‌స్తే వారి వ్యాపారం వారు చేసుకుంటారు... నష్టాలు వ‌స్తే ఇలా కేంద్రం పై ప్ర‌శ్న‌లు కురిపిస్తారు.. ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మే... తెలుగుదేశం నాయ‌కుల‌కు కేంద్రంలో జ‌రిగే ప్రొసీడింగ్స్ వ‌ర్తక వాణిజ్య వ్య‌వ‌హారాల‌లో కాస్త అయినా తెలియాలి క‌దా, దేశాల న‌డుమ వ‌ర్త‌క వాణిజ్యం లో ఎటువంటి ఆటుపోటులు, లోటుపాటులు ఉంటాయో తెలియాలి క‌దా? అస‌లు ఈ విష‌యాన్ని పీఎంవో ప‌ట్టించుకోలేదు. కాని తెలుగుదేశం మ‌ద‌న‌ప‌డుతోంది.. మోదీ ప‌రువుకి భంగం క‌లిగింది అని వీరు భంగ‌పోతున్నారు.
 
ఈ లెక్క‌లు తెలియ‌కుండా దావోస్ అమెరికా సింగ‌పూర్ మ‌లేషియా నుంచి అమ‌రావ‌తికి ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఎలా తీసుకువ‌స్తున్నారో ఆ పెరుమాళ్ల‌కెరుక‌... గ‌తంలో ర‌స్ అల్ ఖైమా, నిస్సాన్, రిల‌య‌న్స్  ప‌లు కంపెనీల విష‌యంలో ఇప్ప‌టికే ఇలాంటి నోటీసులు కేంద్రానికి ప‌దుల సంఖ్య‌లో వ‌చ్చాయి.. అయితే ప్ర‌తీదానికి జ‌గ‌న్ ని  లాగ‌డం, వెంట‌నే దానికి త‌మ ఆస్ధాన మీడియాలో వార్త‌లతో విరుచుకుప‌డ‌టం, హెరిటేజ్ వెన్న‌తో పెట్టిన విద్య.. అందుకే జ‌గ‌న్ పై ఈ అక్క‌సు.
 
ఇక భ్ర‌మ‌రావ‌తి అమ‌రావ‌తి పై కూడా బాబు అనేక ఒప్పందాలు చేసుకుంటున్నారు.. ల‌చ్చ‌ల కోట్ల రూపాయ‌ల  పెట్టుబ‌డులు, ఇతర దేశాల నుంచి వ‌స్తున్నాయి అంటున్నారు.. ఇందులో ఎటుంటి త‌ప్పిదాలు జ‌రిగినా ఇలా విదేశీ కంపెనీలు అక్క‌డి ప్ర‌భుత్వాలు కోర్టుల‌కు వెళ్ల‌క‌త‌ప్ప‌వు ఇది అస‌లు క‌ద...

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.