బిగ్ బ్రేకింగ్ వైసీపీలోకి ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:13:43

బిగ్ బ్రేకింగ్ వైసీపీలోకి ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే

2019 ఎన్నిక‌ల స‌మ‌రానికి ఇంకా ప‌ది మాసాలు గ‌డువు ఉండ‌గానే అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీనియ‌ర్ నాయ‌కులు అంద‌రూ ముంద‌స్తు రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు వైసీపీ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా టీడీపీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు కూడా ఇదే బాట‌ ప‌డుతున్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీనే అధికారంలోకి రావ‌డం ఖాయం అని భావించి జ‌న‌గ్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.
 
అయితే ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ముందంజ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న ప‌క్కా కాంగ్రెస్ నాయ‌కుడు. రాజేశేఖ‌ర్ రెడ్డి హయాంలో 2004లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత 2009లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి పై ఘోర ప‌రాజయం ఎదుర్కొన్నారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టి సారి ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఆయ‌న‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చింది కానీ ఆయ‌న దానిని తిర‌స్క‌రించి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం తీసుకుని కొవ్వూరులో పోటీచేసి గెలిచారు. జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న పొలంరెడ్డి కు ఇప్పుడు క‌ష్ట కాలం చ‌వి చూసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీ త‌ర‌పున గెలిచినా కూడా ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అవడం టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌క‌పోవ‌డం వంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని భావించి చంద్ర‌బాబు పొలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విష‌యం ఆనోట ఈనోట చేరి చివ‌ర‌కు పొలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డికి చేరింది. దీంతో దీపం ఉండ‌గానే ఇల్లు స‌ర్ధుకోవాల‌నే ఉద్దేశ్యంతో త‌న త‌దుప‌రి కార్య‌క్ర‌మాన్నినిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే ఈ క్ర‌మంలో వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను పార్టీలో చేర్పించేందుకు జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు. అంతేకాదు పొలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి స్వయాన బందువు కావ‌డంతో విశేషం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.