మాన‌వ‌త్వం మ‌రిచి ప‌చ్చ పార్టీకి కొమ్ము కాస్తున్న క‌డ‌ప పోలీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-05 11:13:17

మాన‌వ‌త్వం మ‌రిచి ప‌చ్చ పార్టీకి కొమ్ము కాస్తున్న క‌డ‌ప పోలీసులు

ముగ్గురు ఆడపిల్లల తండ్రి,ఒక ఎకరా ఆసామి అయిన రైతు రామచంద్రారెడ్డి, పొలం లో కాసిన కాకరకాయలు రెండు మూటలు, బైక్ మీద కట్టుకొని ప్రొద్దుటూరు మార్కెట్ కు వెళుతుండగా, చాపాడు ఎస్సై.శివశంకర్, పోలీసులు చెకింగ్ కోసం ఆపమన్నారు. r.c., లైసెన్స్ అన్ని ఉన్నాయి. అయితే హెల్మెట్ లేదు ఫైన్ కట్టమన్నాడు. సారూ, పొలాన్నుండి నేరుగా వచ్చాను, నా దగ్గర డబ్బుల్లేవు,మార్కెట్ లో అమ్మి వచ్చి కడతానన్నాడు రైతు.
 
లం...కొడకా, బైక్ దిగి చేతులు కట్టుకొని మాట్లాడు, బండి మీద కూర్చొని జవాబిస్తావా అని  బూటు కాలి తో,రైతు కుడి తోడ మీద కొట్టాడు, బాలన్స్ తప్పి పడిపోతున్న బండి ని పోలీసులు పట్టుకొనగా,ఎస్సై మళ్ళి రైతు మెడ మీద చేత్తో రెండు దెబ్బలు వేసి, అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టాడు.
 
120కేజీ ల బరువున్న మూటలు కట్టుకొని వెళుతున్న రైతు సపోర్ట్ లేకుండా బండి దిగలేడని విషయం పట్టించు కోకుండా,కేవలం బండి మీద కూర్చొని జవాబు ఇచ్చినానని, ఎస్సై బండబూతులు తిడుతూ, నలుగురిలో బూటు కాలి తో కొట్టినాడని,ఇంత అవమానం జరిగాక బ్రతికేది ఎట్టా...? అని కన్నీరు పెట్టుకొంటున్నాడు.
 
హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపే ఎస్సై శివశంకర్ కి, పచ్చ పోలిస్ అని, ఆయన స్టేషన్ కు పచ్చ పోలీస్ స్టేష‌న్‌ అని పేరట. మైదుకూరు tdp ఇంచార్జ్  పుట్టా సుధాకర్ యాదవ్ గారి పాలన దాదాపు  యాదవ్ అధికారులే ఉండేట్టు చూసుకున్నారు. ఎస్సై ది  కూడా అదే కులం. ఆమేరకు రెండేళ్లుగా చాపాడు స్టేషన్  లో, అంతా పచ్చ పరిపాలనే. tdp వారితో ఎందుకు తిరగవు..? పచ్చ కండువా ఎందుకేసుకోవని ఎస్సై నేరుగానే అంటాడట.
 
ఇందులో ఎంత నిజం వుందో కాని, అలాంటి ఆరోపణలు రావటమే  డిపార్టుమెంటు కు సిగ్గుచేటు.
 
ఏ  పార్టీ అధికారంలో వుంటే,
పోలీసులు ఆ పార్టీ కార్యకర్తలలాగా తయారుకావటం,
రాజ్యాంగాన్ని పరిహసించటమే!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.