జోగి ర‌మేష్ పై అక్ర‌మ కేసు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 02:02:33

జోగి ర‌మేష్ పై అక్ర‌మ కేసు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జోగి రమేష్ పై అక్ర‌మ కేసు న‌మోదైంది. వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర వెయ్యి కిలో మీట‌ర్ల మైలు రాయిని చేరుకున్న నేప‌ధ్యంలో సోమ‌వారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వాక్ విత్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఇందులో భాగంగానే వైసీపీ నేత జోగి ర‌మేష్ నేతృత్వంలో కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో పాదయాత్ర నిర్వహించారు. అయితే అనుమ‌తి లేకుండా పాద‌యాత్ర‌ను నిర్వ‌హించారంటూ పోలీసులు జోగి రమేష్ పై కేసు న‌మోదు చేశారు. జోగి రమేష్‌పై అక్ర‌మంగా కేసు నమోదు చేశారంటూ వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.