జేపీ ఇది నిజమా....?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 03:37:17

జేపీ ఇది నిజమా....?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ ప‌రిణామ‌లు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మార్చి నెల‌లో జ‌ర‌గనున్న రాజ్యస‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రోజుకోవార్త తెర‌పైకి వస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి రెండు రాజ్య‌స‌భ సీట్లు, ఒక‌టి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ద‌క్క‌నున్నాయి.
 
ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌పై నిజా నిజాలు తెలుసుకునేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(జేఎఫ్ సీ)  ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క‌మిటీలో  మొద‌టి స‌భ్యుడు లోక్ స‌త్తా వ్య‌వ‌స్ధాప‌కులు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ. 
 
కేంద్ర ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆ నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వం దేనికైనా వాడుకోవచ్చంటూ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ఏపీ ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌ల‌క‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. 
 
మొత్తానికి జేపీ అధికార‌పార్టీకి అనుకూలంగానే వ్య‌హారించారు. ఈ క్ర‌మంలో ప‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జేపీకి రాజ్య‌స‌భ సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సిద్దంగా ఉన్న‌ట్లు  విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారమంటూ ఓ ప్రముఖ తెలుగు దిన ప‌త్రిక క‌థ‌నం రాయ‌డం ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది.
 
టీడీపీలో రాజ్య‌స‌భ సీటు కోసం కీల‌క వ్యక్తులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో నిజంగానే జేపీకి చంద్ర‌బాబు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌నున్నారా......ఇంత‌కీ  చంద్ర‌బాబు రాజ్య‌స‌భ సీట్ల కేటాయింపు వెనుక వేస్తున్న అస‌లు ప్లాన్ ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.