అనంత టీడీపీలో ర‌గ‌డ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 16:20:05

అనంత టీడీపీలో ర‌గ‌డ‌

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే అనంత‌పురం అర్భ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి, అలాగే గుంత‌క‌ల్ ఎమ్మెల్యే జితేంద్ర‌గౌడ్ స‌మ‌స్య పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది.ఇందుకు ముఖ్య కార‌ణం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అని చెప్పాలి. 
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌స్తుత అనంత ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధిష్టానం టికెట్టు ఇస్తే క‌చ్చితంగా పార్టీ ఓడిపోతుంద‌ని జేసీ చెప్పారు. అయితే వారి స్థానంలో కొత్త అభ్య‌ర్థుల‌ను పోటీ చేయిస్తే త‌ప్ప టీడీపీ గెల‌వ‌డం క‌ష్టంతో కూడుకున్న‌ద‌ని జేసీ కొద్ది రోజుల క్రితం జ్యోస్యం చెప్పారు.
 
అయితే ఈ విష‌యంపై అనంత‌పురం అర్భ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి తీవ్రంగా ఖండించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎవ‌రిని పోటీ చేయించాలి అనే విష‌యంపై అధిష్టానానికి పూర్తి క్లారిటీ ఉంద‌ని అన్నారు. ఎవ‌రికి ఎంత ప్ర‌జాధ‌ర‌ణ ఉందో వారికే టికెట్ కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌ను పోటీ చేయ‌నివ్వకూండా త‌న అనుచ‌రుల‌ను పోటీంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిడ్డారు.
 
ఇక మ‌రోవైపు గుంత‌క‌ల్ ఎమ్మెల్యే ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. రానున్న ఎన్నిక‌ల్లో జితేంద్ర‌గౌడ్ బ‌దులు మ‌దుసుద‌న్ గుప్తాను బ‌రిలోకి దింపేందుకు జేసీ దివాక‌ర్ రెడ్డి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకోస‌మే జేసీ గుత్తి ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌ల‌కు గుప్తాను ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న జితేంద్ర తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అని తెలిసి కూడా  జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌దుసుద‌న్ గుప్తాను బ‌రిలోకి ఎలా దింపుతార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. మోత్తానికి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కువ‌చ్చే కొద్ది అనంత‌పురంలో  సీట్ల ర‌గ‌డ త‌గ్గేట‌ట్లు క‌నిపించ‌డం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.