ఏపీలో టీడీపీ కి భారీ షాక్..టీడీపీ పతనం ఖాయం అంటున్న నేతలు.

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-24 01:33:39

ఏపీలో టీడీపీ కి భారీ షాక్..టీడీపీ పతనం ఖాయం అంటున్న నేతలు.

ఏపీ లో టీడీపీ కి భారీ షాక్ తగిలిందా.. ఈ దెబ్బతో టీడీపీ పతనం ఖాయం అయ్యిందా..  ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ లో కలవరలు మొదలయ్యాయి దాంతో స్పెషల్ ఆఫీసర్ లతో నెట్టుకొద్దామనుకున్న టీడీపీ కి భారీ షాక్ తగిలానట్లయ్యింది.. మరి టీడీపీ ఈ పంచాయితీ ఎన్నికలకు ఎందుకంత భయపడుతుంది.. ఇప్పుడు చూద్దాం.. 
 
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.90ని హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్పంచ్‌ల గడువు ముగియడంతో, పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు కోర్టులో సవాల్ చేశారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
 
కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  అన్ని వివరాలు సేకరించి పరిశీలించిన మీదట హై కోర్టు ఈ సంచలన తీర్ప