టీడీపీకి 33 వైసీపీకి 77 ఆ 65 సీట్లు కీలకం ఇది ఫైన‌ల్ స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 18:36:46

టీడీపీకి 33 వైసీపీకి 77 ఆ 65 సీట్లు కీలకం ఇది ఫైన‌ల్ స‌ర్వే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అటు ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తోపాటు జాతీయ మీడియాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ర్వేలో టీడీపీ నాయ‌కుల ప‌ట్టు ఏ మేర‌కు ఉంది, వైసీపీ నాయ‌కులు ప‌ట్టు ఏ మేర‌కు ఉంద‌నే విష‌యంపై స‌ర్వే నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావ‌చ్చు అనే అంశంపై ఓ ప్ర‌ముఖ సంస్థ కీల‌క స‌ర్వే ను నిర్వ‌హించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించే ఈ స‌ర్వేలో అధికార తెలుగు దేశంపార్టీకి ఎన్ని సీట్లు రావ‌చ్చు, అలాగే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావ‌చ్చు, పోటా పోటీగా ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయ‌నే దానిపై ఈ స‌ర్వే నిర్వ‌హించారు.
 
అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం అధికార తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్య‌ర్థులు పోటీ చేస్తే 33 అసెంబ్లీ సీట్లను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. ఇక ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే సుమారు 77 అసెంబ్లీ సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని తెలిపింది. ఇక జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని అది కేవ‌లం ఒక‌టి లేక రెండు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని తెలిపింది. కానీ టీడీపీకి గ‌ట్టి పోటీగా త‌గ‌ల‌నుంద‌ని ఈ సర్వే తెలిపింది. స‌ర్వే ప్ర‌కారం 110 సీట్లపై పూర్తి స్ప‌ష్ట‌త ఉంది ఇక మిగిలిన 65 సీట్ల‌ల్లో టీడీపీకి వైసీపీకి 50-50 ఛాన్సస్ ఉన్నాయ‌ని తెలిపింది. 
 
ఈ 65 సీట్ల‌ల్లో ఏ పార్టీ అయితే అత్య‌ధిక మెజారిటీ తెచ్చుకుంటుందో ఆ పార్టీ నే 2019లో అధికారం చేజిక్కించు కుంటుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది.  అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం ఆలోచిస్తే ఈ 65 అసెంబ్లీ సీట్ల‌ల్లో వైసీపీ నాయ‌కులు త‌మ‌కున్న‌ ఓటు బ్యాంకింగ్ కాపాడుకుంటే చాలు ఖ‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే 2014లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇప్పుడు ఈ మూడు పార్టీలు విడిపోవ‌డంతో ఖ‌చ్చితంగా ఓట్లు చీలడం ఖాయం. అందులో ముఖ్యంగా టీడీపీలో ఉన్న జ‌న‌సేన‌ ఓట్ల‌న్ని చీలుతాయి. సో ... ఈ 65 సీట్ల‌లో టీడీపీ నెగ్గాలంటే క‌ష్టంతో కూడుకుని ఉంది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇది చూసిన వైసీపీ నాయ‌కులు సంబ‌ర‌ప‌డుతుంటే, టీడీపీ నాయ‌కులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఇక మ‌రో వైపు జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.