మ‌ళ్లీ మొద‌టికి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 17:58:13

మ‌ళ్లీ మొద‌టికి

ఏపీ రాజ‌కీయాల్లో క‌ర్నూలు రాజ‌కీయాలు 2014 నుంచి ప‌లు డైవ‌ర్ష‌న్లు తీసుకుంటున్నాయి... తెలుగుదేశం ప్ర‌త్యేకహూదా పై యూట‌ర్న్ తీసుకున్న విధంగానే  తీసుకుంటున్నాయి.. ఇక ఇప్ప‌టికే ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ రెండు రోజుల క్రిత‌మే అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు తేల్చారు...
 
మంత్రి అఖిలప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి ఇరువురు స‌యోధ్య‌గా క‌లిసి ప‌నిచేయాల‌ని తెలియ‌చేశారు... అయితే మీడియా ముఖంగా ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ తేలిపోయింది,  కాఫీలో సునామీ తుఫాను అని వ‌ర్ల  రామ‌య్య కూడా అన్నారు... అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం అక్క‌డ మ‌ళ్లీ వ‌ర్గ పోరు పాత ప‌ద్ద‌తికే తిరిగి వ‌చ్చింది అంటున్నారు.
 
అస‌లు విష‌యానికి వ‌స్తే తాజాగా ఏవీ సుబ్బారెడ్డి తన వర్గీయులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని కీల‌క వాఖ్యలు చేయడం మళ్ళీ దుమారాన్ని లేపుతున్నాయి అని తెలుస్తోంది... వచ్చే ఎన్నికలలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం  నుండి శాసనసభ స్థానానికి పోటీ చేసేది తానేనని, అందుకు తగినవిధంగా  ఇప్పటినుంచే ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ పోవాలని తన అనుచరులకు సూచించారట. ఇప్పుడు ఈ వార్త ఆళ్ల‌గ‌డ్డ‌లో వైర‌ల్ అవుతోంది... ప్ర‌తీ ఒక్క‌రూ ఇదే చ‌ర్చించుకుంటున్నారు.. సీఎంతో చ‌ర్చ‌ల త‌ర్వాత ఆయ‌న ఈ మాట అన్నారా అని కూడా ఇక్క‌డ కేడ‌ర్ మ‌ధ్య చర్చ న‌డుస్తోంది.
 
ఇక ఊళ్లో అంద‌రికి తెలిసిన త‌ర్వాత ఇంటిలో తెలుస్తుంది అనేలా ఉంది ఇక్క‌డ రాజీక‌యం.. ఈ విష‌యం అలా ఇలా మంత్రి అఖిల‌కు తెలిసింది  అని అంటున్నారు.... ఇక ఆమె మంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్క‌డ ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆయ‌న‌కు ఎలా ఇస్తారు అని ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది అంటున్నారు... మ‌రి చూడాలి వీరి రాజ‌కీయం మ‌ళ్లీ అమ‌రావ‌తికి వెళుతుందా లేదా స‌మ‌స్య‌లు లేకుండా స‌యోధ్య‌గా సాగుతుందా అని చ‌ర్చించుకుంటున్నారు ఆళ్ల‌గ‌డ్డ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.