గంటా కోట‌లో వార‌సులంట‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 03:20:17

గంటా కోట‌లో వార‌సులంట‌?

ఏపీ రాజ‌కీయాల్లోకి త‌మ వార‌సుల‌ను దింప‌డానికి వ్యుహాలు ర‌చిస్తున్నారు రాజ‌కీయ‌ నాయ‌కులు. ఇప్ప‌టికే క్రీయాశీల‌క రాజ‌కీయాలు చేస్తున్న వారిని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని యోచిస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటి చేయాల‌ని అనుకుంటున్నారో, అక్క‌డ త‌న కేడ‌ర్‌ను త‌యారు చేసుకుంటూ సేవా కార్య‌క్ర‌మాల‌తో, ప్ర‌జా సేవ‌కు అంకితం చేయిస్తున్నారు త‌ల్లిదండ్రులు.
 
ఇప్ప‌టికే పూర్తి స్థాయి రాజ‌కీయాలు చేస్తున్న మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌, ఎం.పి జేసీ వార‌సులు ప‌వ‌న్, అస్మిత్, మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు, ఎంపీ టీ.జీ వెంక‌టేశ్ కుమారుడు టీజీ భ‌ర‌త్‌, స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ త‌న‌యుడు, ఇటీవ‌ల మ‌ర‌ణించిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కొడుకు, వీరితో పాటు తెర మీద‌కు వ‌చ్చే వార‌సులు మ‌రి కొంద‌రు ఉన్నారు.
 
కొంద‌రు నాయ‌కులు వార‌సుల కోసం త‌మ స్థానాల‌ను సైతం వ‌దులుకుంటామ‌ని, మ‌రి కొంద‌రు త‌మ స్థానాల‌తో పాటు వార‌సుల‌కు సైతం స్థానం క‌ల్పించాల‌ని పార్టీ అధిష్టానానికి తెలియ‌జేస్తున్నారు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావు మాత్రం  త‌న వార‌సుడు జ‌య‌దేవ్‌తో పాటు, అల్లుడు పుల‌ప‌ర్తి ప్ర‌శాంత్  ని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిద్ద‌రి పోటీపై అధినేత చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. దీన్ని బ‌ట్టి 2019 ఎన్నిక‌ల్లో యువ‌కులు పెద్ద ఎత్తున అరంగేట్రం చేయ‌వ‌చ్చు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.