వైసీపీకి మ‌రింత జోష్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 17:47:35

వైసీపీకి మ‌రింత జోష్ ?

ఉభ‌య గోదావ‌రి జిల్లాలో వైసీపీ మ‌రింత చురుకుగా దూసుకుపోవాలి అని చూస్తోంది.. ఇటు వైసీపీ కేడ‌ర్ మ‌రింత బ‌లంగా గ‌తంలో కంటే పార్టీ త‌ర‌పున యాక్టీవ్ గా ఉంటోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట‌మిని ప‌క్క‌న పెట్టి ఈసారి మ‌రింత క‌ష్ట‌ప‌డి పార్టీని పైకి తీసుకువ‌చ్చి కేడ‌ర్ లో ఆత్మ‌స్దైర్యం నింపి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌లో సాధించాలి అని ఉత్సుక‌తో ఉన్నారు నాయ‌కులు.
 
ఇక నంద్యాల ఫ‌లితాల ఎఫెక్ట్ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌డింది అనేది అంద‌రికి తెలిసిందే... అయితే తెలుగుదేశం క్రెడిట్ గా అది కూడా వారి ఖాతాలో వేసుకుంటున్నారు నాయ‌కులు. ఇక్క‌డ తెలుగుదేశానికి ప‌లు అంశాలు గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాలుగా పెద్ద మైన‌స్ అయ్యాయి అని చెప్ప‌వ‌చ్చు... ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపుల‌ ఉద్యమం, దివీస్ ఫ్యాక్ట‌రీ వ‌ద్దంటూ  పంపాది పేట కొత్త‌పాక‌ల‌లో దివీస్ కు వ్య‌తిరేకంగా అక్క‌డ గ్రామ‌స్తులు మందుకు వ‌చ్చారు.
 
ఇక దివీస్ కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన వారిపై  పోలీసులు దాడులు చేయ‌డం. ఇక కాపు ఉద్య‌మంతో పాటు మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో ప్ర‌జ‌ల పై దాడులు చేయ‌డం.. కాపుల‌కు ఐకాన్ గా ఉన్న ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ కుటుంబం పై తెలుగుదేశం స‌ర్కారు అవ‌లంభించిన చ‌ర్య‌లు... తుని రైల్వే ఘ‌ట‌న‌లో కాపు యువ‌త పై కేసులు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో తెలుగుదేశం పై వ్య‌తిరేక‌త‌ను పెంచేలా చేశాయి. చాలా గ్రామాల్లో 144 సెక్ష‌న్ విధించ‌డం కూడా ఇక్క‌డ స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను  పెంచాయి. అయితే కొద్ది రోజులుగా పార్టీ నుంచి వ‌ల‌స‌లు మాత్ర‌మే ఉన్నాయి.. కాని ఇటీవ‌ల గుంటూరులో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పార్టీలో ఓ కీల‌క నాయుడు ఉభ‌య‌గోదావ‌రి నుంచి వైసీపీలో చేర‌డంతో ఇక్క‌డ పార్టీకి మ‌రింత జోష్ వ‌చ్చింది అని చెప్పాలి
 
తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడవరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్  250 వాహనాల భారీ కాన్వాయ్‌తో నాలుగు మండలాల నుంచి అనుచరులు, నాయకులతో కలిసి వచ్చి  గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ముమ్మిడివరంలో వైసీపీ త‌ర‌పున పొన్నాడ స‌తీష్ కు టికెట్ ప‌క్కా అని కూడా ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అక్క‌డ శెట్టి బ‌లిజ వివాదానికి కూడా జ‌గ‌న్ ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు అని, ఇప్పుడు అక్క‌డ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక తూగోలో ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో ప్ర‌జ‌లు కూడా వైసీపీకి మ‌రింత మ‌ద్ద‌తుగా ఉంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.