ఆ ఐదుగురిపై ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 16:59:29

ఆ ఐదుగురిపై ఫైర్

ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌పై అటు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ న‌టుల‌పై ఎలాంటి విష‌యం అయినా ముక్కుసూటిగా  మ‌ట్లాడే వ్య‌క్తి పోసాని కృష్ట ముర‌ళి... ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ...ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలుగు చిత్ర‌పరిశ్ర‌మకు చెందిన కొంద‌రు పెద్ద‌లు  కొద్ది రోజుల క్రితం ప్ర‌త్యేక హోదా ఉద్య‌మానికి సినీ ఇండ‌స్ట్రీ మొత్తం మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్పిన వారిపై తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు ఆయ‌న‌... మీరు ఐదుగురు ఎవ‌రిని  అడిగి చంద్రబాబుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, ఏ విష‌య‌మైనా ఒక క‌మిటి వేసి నిర్ణ‌యం తీసుకునే మీరు ఇంత‌ స‌డ‌న్ గా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్ప‌డాన్ని మంచిది కాద‌ని అన్నారు.
 
అయితే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు పోసాని... సీఎంకు మీరు మద్దతు ఇవ్వడంతో కులం రంగు పులుముకుంటోందని, చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉందని ఆయన అన్నారు.
 
ప్ర‌త్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు అంటూ ఓ ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింద‌ని తాను కూడా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తినేన‌ని చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇచ్చేట‌ప్పుడు త‌న‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేదని అన్నారు... ఇండ‌స్ట్రీలో తాను 33 సంవ‌త్స‌రాల‌నుంచి ఉన్నాన‌ని అలాంటి న‌న్ను మ‌ద్ద‌తు కోసం  ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని త‌ప్పుబ‌ట్టారు.. చంద్రబాబుకు అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, వెంకటేశ్వర్‌రావు, కిరణ్‌ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ద్ద‌తిగా లేద‌ని అన్నారు.
 
ఒక‌వేళ  చిత్ర‌ప‌రిశ్ర‌మ మొత్తం ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తు తెలిపినా కానీ తాను మాత్రం మ‌ద్ద‌తు తెలుప‌న‌ని స్ప‌ష్టం చేశారు... గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఏ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్లే అనేక ఉప‌యోగాలు ఉంటాయ‌ని చెప్పారు.. ఇప్పుడు మాట‌మార్చుతున్నార‌ని పోసాని మండిప‌డ్డారు..సీఎంకు  మద్దతు ఇస్తే కులం రంగు పూసుకున్న‌ట్లే అని అన్నారు.. చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టు అన్నట్టుగా ఉంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.