పాదయాత్రలో ప్రముఖ దర్శకుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 16:49:02

పాదయాత్రలో ప్రముఖ దర్శకుడు

ప్రజల సమస్యలను తెలుసుకుని, రాజన్న రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో  పాదయాత్ర చేస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి..ఈ పాదయాత్రలో జగన్ ప్రజలకు భరోసా ఇస్తూ, టీడీపీ అవినీతిని ఎండగడుతూ, ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ, అధికారంలోకి వ‌చ్చి అమలుచేయబోయే నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు...
 
ఈ పాదయాత్రలో జగన్ కు పెరుగుతున్న మద్దతును చూసి ప్రముఖులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని వర్గాల వారు పాదయాత్రలో  పాల్గొని జగన్ కి మద్దతు తెలిపారు...వారి సమస్యలను జగన్ కి తెలియజేస్తున్నారు...జగన్ వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు...
 
ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి రాష్ట్ర రాజకీయాలలో ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ ముక్కుసూటిగా విమర్శలు చేస్తుంటారు ...ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైనా ఎన్నో సార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు ఆయన..అలాగే జగన్ పై తనకున్న‌ అభిమానాన్ని కూడా మీడియా ముఖంగానే తెలియజేశారు పోసాని...అదే అభిమానంతోనే  ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ని కలుసుకుని, జగన్ తో పాటు పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.