దుమ్ము దులిపిన పోసాని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 18:17:25

దుమ్ము దులిపిన పోసాని

ఇటు సినీ ఇండ‌స్ట్రీలోని విష‌యాల‌పైన కానీ, అటు రాజ‌కీయ నాయ‌కుల ప‌రిపాల‌న‌పై కానీ ఏ విష‌యం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ మురళీ. ఈయ‌న గ‌తంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తాను వైఎస్ జ‌గ‌న్ కు ఓటు వేస్తాన‌ని ప్ర‌క‌టించి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత నుంచి ఏపీలో ప‌రిపాల‌నపై విమ‌ర్శ‌లు చేస్తూ  రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో ల‌వ్యూ రాజా అనిపించుకుంటున్నారు పోసాని.
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై, అలాగే ఆయ‌న కూమారుడు మంత్రి లోకేష్ పై  దుమ్ము దులిపారు పోసాని. ఈ స‌మావేశంలో తండ్రిని కొడుకుని విడివిడిగా క‌డిగిపారేశారు.... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసిన‌ట్లే అని మంత్రి లోకేశ్ అన్న మాట‌ల‌పై తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు పోసాని... వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఎలా ఓటు వేసిన‌ట్లు అవుతోందని విమ‌ర్శించారు. అయితే టీడీపీకి ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసిన‌ట్లు కాదా ! అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కేవ‌లం క‌మ్మ వారు మాత్ర‌మే రాజ్యం ఏలాలా అని విమ‌ర్శించారు పోసాని కృష్ణ ముర‌ళి.
 
అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై మాట్లాడుతూ, నాలుగు సంవ‌త్స‌రాలుగా అవినీతికి పాల్ప‌డుతున్న‌ది ఎవ‌రు చంద్ర‌బాబు నాయుడా లేక వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినా అని ప్ర‌శ్నించారు. గంతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్ర‌త్యేక‌హోదా అమ్ముడు పోయార‌ని విమ‌ర్శించారు. 
 
అలాగే 23 మందికి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అధికార బ‌లంతో వారికి ప్ర‌లోభాల‌కు ఆశ‌పెట్టి పార్టీలోకి లాక్కున్న‌ది చంద్ర‌బాబు కాదా అని ప్ర‌శ్నించారు. అయితే ఈ విష‌యాల‌న్నంటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చంద్ర‌బాబుపై సీబీఐ విచార‌ణ చేయించి ఉంటే ఎప్పుడో జైల్లో ఉండేవార‌ని పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. 
 
అలాగే జ‌గన్ మీదున్న కేసుల‌న్నీ రాజ‌కీయ ప‌ర‌మైన కేసులే అన్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ  తెలుస‌ని అన్నారు. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ లో నుండి బ‌య‌ట‌కు రాగానే శంక‌ర్ రావు, టీడీపీ నేత య‌ర్ర‌న్నాయుడు క‌లిసి   కోర్టులో కేసులు వేశార‌ని అన్నారు. అయితే ఈ కేసులు ఆయా పార్టీల నాయ‌కులు భ‌య‌ప‌డే జ‌గ‌న్ అక్ర‌మ కేసులు పెట్టార‌ని పోసాని తెలిపారు. అయితే ఈ కేసు నిలువ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.