పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 16:25:27

పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన హాస్య న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి ఈ రోజు తెలుగు దేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారందరూ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై నిర‌స‌న‌లు ఎలా చేస్తామ‌ని, మొన్న‌టివ‌ర‌కు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజీనే రాష్ట్రానికి మేలు క‌లుగుతుంద‌ని చేప్పార‌న్నారు.. అయితే మ‌ళ్లీ ఇప్పుడు మాట మార్చి ప్ర‌త్యేక హోదా కావాలంటూ మ‌రో నాట‌కం ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు పోసాని కృష్ణ ముర‌ళి.
 
ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ బాబు రాజేందప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు... తాము కుల‌క‌డానికి త‌ప్ప మ‌రే ఇత‌ర ప‌నుల‌కు ప‌నికిరామ‌న్నార‌ని, ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా అంటూ మండిప‌డ్డారు పోసాని... 
 
ఒక‌ప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా అని ఎవ‌రైనా అంటే జైలుకే అన్నారని తెలిపారు... మళ్లీ ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అంటున్నారని, ఆయ‌న‌లాగా తాము రాజ‌కీయ బ్రోక‌ర్ కాద‌ని, ప్ర‌త్యేక హోదా కోసం అప్పుడొక మాట‌, ఇప్పుడొక మాట చెప్పి ఆయ‌న‌లా ఉద్య‌మం చేసి బ్రోక‌రిజం చేయ‌లేమ‌ని అన్నారు...
 
దీంతో పాటు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్ర‌మంతా తిరిగి అసెంబ్లీ సీట్ల‌ను గెలుచుకుంటే... ఈ ముఖ్య‌మంత్రి త‌న అధికార బ‌లంతో విచ్చ‌ల‌విడిగా వారికి కోట్ల రూపాయ‌ల డ‌బ్బుల‌ను కుమ్మ‌రించి వారిని టీడీపీలోకి చేర్చుకున్నార‌ని మండిప‌డ్డారు.. చంద్ర‌బాబు కు ఏ మాత్రం చిత్త‌శుద్ది ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వారిని పార్టీలో చేర్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు పోసాని...
 
అందులో భాంగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ వైసీపీ నేత‌లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే... మొన్న‌టివ‌ర‌కూ కేంద్రంపై అవిశ్వాసం పెడితే ఏమొస్తుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.... మ‌ళ్లీ తిరిగి  తెలుగు దేశం పార్టీ త‌రుపున తాము అవిశ్వాస తీర్మానం పెడుతుంద‌ని చెప్ప‌డం చాలా సిగ్గుచేటు రాజా అంటూ పోసాని అన్నారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.