వైసీపీలో కీల‌క ప‌ద‌వుల నియామ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 18:47:16

వైసీపీలో కీల‌క ప‌ద‌వుల నియామ‌కం

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక ప్ర‌క్క పాద‌యాత్ర చేస్తూనే మ‌రో ప‌క్క ఏ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉందో  ఆ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సాధిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు త‌గిన‌ట్లు ప‌లు నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నారు జ‌గ‌న్. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రెండ్ న‌డుస్తుండ‌టంతో పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలకు సోషల్ మీడియా ఇంచార్జ్ ల‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఇదే క్ర‌మంలో పార్టీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్ల‌సిరి  గోపాల్ రెడ్డిని, అలాగే గుంటూరు జిల్లాకు చెందిన‌ టీజీ కృష్ణారెడ్డిల‌ను పార్టీ త‌ర‌పున కేంద్ర నిర్వ‌హాక మండ‌లి సీఈసీ స‌భ్యులుగా నియ‌మించారు. పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరిక మేర‌కు వీరిద్ద‌రిని నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ అధిష్టానం ఒక ప్ర‌క‌ట‌న‌ కూడా జారీ చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.