వైసీపీలో కీల‌క ప‌ద‌వులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:08:43

వైసీపీలో కీల‌క ప‌ద‌వులు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారం ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్నారు. ఇక‌ మ‌రోప‌క్క జిల్లాల వారిగా పార్ల‌మెంట్ ప‌రిధిలో వైసీపీ నాయ‌కులకు కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గిస్తున్నారు జ‌గ‌న్. అయితే ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఇంచార్జ్ ల‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు విశాఖప‌ట్నం పార్ల‌మెంట్ ప‌రిధిలో కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గించిన‌ట్లు పార్టీ కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. అందులో ముఖ్యంగా విశాఖ పార్ల‌మెంట్ సెగ్మెంట్ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ముళ్ల‌పూడి వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ ఎంపీక అయ్యారు. 
 
ఇక వేర్వేరు హోదాల‌కు చెందిన వారు పసుపులేటి ఉషాకిరణ్‌, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్టా రెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు వెల్లడించింది. విశాఖపట్నం నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గ సింగిల్‌ కో- ఆర్డినేటర్‌గా కమ్మిల కన్నపరాజును నియమించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.