వైసీపీలో ప‌ద‌వుల నియామ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 18:33:10

వైసీపీలో ప‌ద‌వుల నియామ‌కం

ఏపీ ప్ర‌తిప‌క్షనేత  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ర‌చిస్తున్న వ్యూహాలకు అధికార తెలుగు దేశం పార్టీకి చేందిన నాయ‌కులు అతలాకుతలం అవుతున్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేక‌త, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర, కేంద్రంలో తిరగని చక్రం ఇవ‌న్ని చూస్తుంటే టీడీపీకి పునాదులు కదులుతున్నా పరిస్తితులు ఏపీలో కనిపిస్తోంది. అనేక‌ సమస్యలతో తీవ్ర స్తాయిలో సతమవుతున్న టీడీపీని మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు వైఎస్ జగన్  సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.
 
గడిచిన మూడు దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉండే బీసీ వర్గాలను ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా తన వైపు తిప్పుకోవడంలో వైఎస్ జగన్ విజయవంతం అవుతున్నార‌నే చెప్పాలి. బీసీల‌కు వారి జీవ‌నోపాధికి స‌రిపోయే వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం మాత్ర‌మే ప్రభుత్వ బాధ్యత కాదని బీసీగా పుట్టిన ప్ర‌తీ పిల్ల‌వాడికి ఉన్నత చదువులు అందించి ప్ర‌తిభావంతుల‌ను చేయ‌డం ప్రభుత్వ బాధ్యత అని జగన్ అనేక సంద‌ర్భాలో పేర్కొన్నారు. బీసీల‌పై జ‌గ‌న్ చూపుతున్న ప్రేమ‌ను చూసి బీసీ వ‌ర్గాల్లో జ‌గ‌న్ పై ఆదరణ పెరుగుతోంది
 
ఇప్పటి దాక ప్రసంగాలు, హామీలతో బీసీలను ఆకర్షిస్తున్న వైఎస్ జగన్ నేడు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, పార్టీలో అత్యంత కీలకమైన యువజన విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షునిగా బీసీ కులాల్లో రాజకీయ ప్రాధాన్యత కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందిన హరీష్ కుమార్ యాదవ్ ను నియమించిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఇప్పటికే సీనియర్ బీసీ నాయకులైన మోపిదేవి, పార్ధసారధి, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ లాంటి నాయకులు బీసీ సామజిక వర్గాల్లో పార్టీ ముద్రను వేస్తూ బలోపేతం చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.