జేసీపై ప్ర‌భోదానంద‌స్వామి సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and prabhodanda swamy
Updated:  2018-09-22 10:50:31

జేసీపై ప్ర‌భోదానంద‌స్వామి సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో వ‌ర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మొన్న ప్ర‌భోదానంద స్వామి వ‌ర్సెస్ జేసీ వ‌ర్గీయుల‌ వివాదాలు కాస్తా కాకీ వ‌ర్సెస్ క‌ద్ద‌ర్ గా మారాయి. అయితే ఇప్పుడు తిరిగి ప్ర‌భోదానంద స్వామి వ‌ర్గానికి తాకింది. ఈ క్ర‌మంలో ప్ర‌భోదానంద స్వామి స్పందించి జేసీ దివాక‌ర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ‌లు చేశారు. 2003లో  ఆశ్ర‌మం నిర్మిస్తే ఈ ఆశ్ర‌మ ప్రారంభోంత్స‌వానికి తాము జేసీ దివాక‌ర్ రెడ్డిని ఆహ్వానిస్తే వ‌చ్చార‌ని ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టారు. 
 
అయితే ఇప్పుడు ఆయ‌న‌కు ఆశ్ర‌మం నుంచి డ‌బ్బులు ఇవ్వ‌కున్నామ‌నే ఉద్దేశంతో క‌క్ష‌సాధిస్తున్నార‌ని ప్ర‌భోదానంద స్వామి మండిప‌డ్డారు. డ‌బ్బులు ఇవ్వ‌నందుకు జేసీ త‌మ‌ను ఎంతో వేధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ మీద క‌క్ష‌తో ప‌క్క గ్రామ‌స్తుల ప్ర‌జ‌ల‌ను జేసీ వ‌ర్గీయులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కొద్దికాలంగా జేసీ త‌మ‌పై త‌మ ఆశ్ర‌మంపై చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి అవాస్త‌వాలు జ‌రగ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.
 
త‌మ ఆశ్ర‌మంలో అసాంఘిక కార్య‌క్ర‌మాలు జ‌రిగితే ఎందుకు ఇంత‌మంది వ‌స్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు త‌మ ఆశ్ర‌మానికి వ‌స్తార‌ని ప్ర‌చారం కోసం తాము పాకులాడ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ఆశ్ర‌మం త‌ర‌పున అడిగిన వారికి అన్నం పెట్టామ‌ని అన్నారు. 1995లో బీజేపీ వారికి ఆశ్ర‌యం క‌ల్పిస్తే త‌మ‌నుకొట్టి పంపించార‌ని ఆ త‌ర్వాత 2003లో మ‌ళ్లీ ఆశ్ర‌మం నిర్మించామ‌ని ఈ ఆశ్ర‌మ ప్రారంభోత్స‌వానికి జేసీ వ‌చ్చార‌ని ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.