సంచ‌లనం.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మీ అంతుచూస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy
Updated:  2018-09-22 17:53:46

సంచ‌లనం.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మీ అంతుచూస్తా

అనంపురం జిల్లా తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు రోజు రోజుకు హ‌ద్దు మీరుతున్నాయి.  కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ ప్రభోదానంద స్వామిగా మారిన‌ వ్య‌వ‌హారం ఇప్పుడు ఖాకీ వ‌ర్సెస్ ఖ‌ద్ద‌ర్ గా మారి తిరిగి అదే రీతిలో ప్ర‌భోదానంద స్వామికి చేరింది. దీంతో ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి జేసీ దివాక‌ర్ రెడ్డిపై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
1995లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులకు ఆశ్ర‌మంలో స‌హాయం క‌ల్పించినందుకు త‌మ‌ను త‌రిమేశార‌ని అప్పుడు కొద్దిరోజులు బెంగుళూరులో త‌ల‌దాచుకున్నామ‌ని ఆ త‌ర్వాత 2003లో తిరిగి తాడిప‌త్రి స‌మీపంలో ఆశ్ర‌మం నిర్మిస్తే ప్రారంభోత్స‌వానికి జేసీ దివాక‌ర్ రెడ్డిని ఆహ్వ‌నించామ‌ని అయితే త‌మ ఆహ్వానానికి అతిధిగా జేసీ వ‌చ్చార‌ని ప్ర‌భోదానంద స్వామి మీడియా ద్వారా తెలిపారు. 
 
ఈ రోజు ఆశ్ర‌మంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌స్తుతం త‌మ ఆశ్ర‌మం నుంచి జేసీకి డ‌బ్బులు ఇవ్వ‌నందుకు త‌మ‌పై క‌క్ష‌సాధిస్తున్నార‌ని ప్ర‌భోదానంద స్వామి మండిప‌డ్డారు. అంతేకాదు తాను దేవుడిని కాద‌ని దేవుడికి సేవ‌లు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే తాము ఏ దేవుడిని కించ‌ప‌రిచే విదంగా మాట్లాడ‌లేద‌ని అన్నారు.
 
జేసీ దివాక‌ర్ రెడ్డి కావాల‌నే త‌మ‌పై క‌క్ష‌తో ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. త‌మ‌పై దుష్ప్ర‌చారం చేయించి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆశ్ర‌మం క‌బ్జా చెయ్యాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌భోదానంద స్వామి మండిప‌డ్డారు. అంతేకాదు తాను త‌ర్వాలో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.