వైసీపీ ప్ర‌కాశంలో మ‌రింత వికాసం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:49:45

వైసీపీ ప్ర‌కాశంలో మ‌రింత వికాసం

ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ జెండా ఎగుర‌వేయాల‌ని, జెండాక‌ట్టే కార్య‌క‌ర్త నుంచి,  జిల్లా ఇంచార్జ్ ల‌ వ‌ర‌కూ అంద‌రికి ఒకే ప‌ట్టుదల ఉంది.. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా రెప‌రెప‌లాడించినా, ఇక్క‌డ మాత్రం తెలుగుదేశం చిల‌క‌కొట్టుడు రాజ‌కీయాలుచేసింది.. ఇక్క‌డ వైసీపీని పాతాళానికి తొక్కాల‌ని వారు ఆకాశానికి ఎక్కాల‌ని యోచించారు.. అందినకాడికి నాయ‌కుల‌కు  వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించేలా చేశారు..
 
ఇక జిల్లాలో వైసీపీలోకి మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయ‌న వైసీపీలో చేరుతున్నాను అని ముహూర్తం కూడా ప్ర‌క‌టించారు.. ఇక్క‌డ తెలుగుదేశం పాచిక‌లు పార‌లేదు అనే చెప్పాలి.. ఆయ‌న్ని పార్టీలో చేర్చుకోవాలి అని అనుకున్నా, అది కుద‌ర‌లేదు.. అయితే వైసీపీ త‌ర‌పున గెలిచిన పోతుల రామారావును వైసీపీలో నుంచి టీడీపీలో చేర్చుకుంది టీడీపీ. దీంతో దివిఫ్యామిలీ త‌న బాధ‌ను ఎవ‌రికి చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌యింది. 
 
2016 లోనే పోతుల రామారావు టీడీపీ పంచన చేరారు... అయితే ఇక్క‌డ వైసీపీ మ‌రింత గ‌ట్టిప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకుందాం అని అనుకున్నా, అప్ప‌టి నుంచే మానుగుంట‌ని పార్టీలో చేర్చుకోవాలి అని భావించారు జ‌గ‌న్.ఇక్క‌డ తెలుగుదేశం గ‌తంలో రెండు సార్లు గెలిచింది... ఓసారి  వైసీపీ గెలిచింది... ఇక మిగిలిని ఎన్నిక‌ల వేళ హ‌స్తం పార్టీ ప్ర‌తీసారి త‌న హ‌స్త గ‌తం చేసుకుంది కందుకూరు సెగ్మెంట్..
 
ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ కంచుకోట అని జిల్లాలో చెబుతారు.. అయితే తెలుగుదేశం పార్టీ స్ధాపించిన త‌ర్వాత రెండు సార్లు మాత్ర‌మే ఇక్క‌డ విజ‌యం సాధించింది సైకిల్ పార్టీ.. ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున దివి శివ‌రాం కీల‌క నాయ‌కుడు, గ‌తంలో 94-99 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇక్క‌డ టీడీపీ చ‌రిష్మా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో చూపించ‌లేకపోయింది.. ఆ స‌మ‌యంలో కూడా రెండు సార్లు కాంగ్రెస్ విజ‌య ఢంకా మోగించింది.
 
ఈ సెగ్మెంట్లో ఎవ‌రు ఎంత చ‌ర్చించుకున్నా దివి ఫ్యామిలీ టీడీపీ త‌ర‌పున, ఇక కాంగ్రెస్ త‌ర‌పున మానుగుంట ఫ్యామిలీకి రాజ‌కీయ వైరం ఉంది.. కందుకూరు అంటే మ‌హీథ‌ర్ రెడ్డి పేరే గుర్తువ‌స్తుంది..1989 -2004-2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపొందారు..
 
ఇటు నెల్లూరు జిల్లాలో వైసీపీ త‌ర‌పున ఉన్న ముగ్గురు రెడ్ల కుటుంబాల‌కు మానుగుంట ఫ్యామిలీకి బంధుత్వం ఉంది అదే స‌మ‌యంలో వారు పార్టీలోకి రమ్మ‌ని గ‌తంలో అనేక‌సార్లు ఆహ్వ‌నించారు... ఇక ఆయ‌న ఎంట్రీ 11న అని  చెప్ప‌డంతో ఇప్పుడు ఇదే వారికి మ‌రింత ప్ల‌స్ అయింది..ఇటు మేక‌పాటి కుటుంబం నుంచి మానుగుంట‌కు ఆహ్వానం అందింది అనేది పెద్దగా చ‌ర్చించుకుంటున్న అంశం.
 
ఇక  జిల్లాలో ఫిరాయింపు సెగ్మెంట్లో భారీ విజయం వైసీపీకి ప‌క్కా అనేది తెలుస్తోంది ఈయ‌న వైసీపీ ఎంట్రీ అనే ప్ర‌క‌ట‌న‌తో .. ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున మ‌రో రూమ‌ర్ పోతుల రామారావుకు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది.. ఎమ్మెల్యే అయ్యారు ఇప్ప‌డు చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ ఇస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేకు డిపాజిట్లు కూడా రావు.. అందుకే ఆయ‌న‌కు కాకుండా డాక్ట‌ర్ దివి శివ‌రాం కి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తారు అంటున్నారు..ఇక నాలుగేళ్లు రాజ‌కీయాల‌ద‌కు దూరంగా ఉన్న మ‌హీధ‌ర్ రెడ్డి కూడా రాజ‌కీయంగా వైసీపీలో యాక్టీవ్ అవ్వాలి ఇటు మండ‌లాల వారిగా నాయ‌క‌త్వం బ‌లోపేతం  చెయ్యాలి... ఏతా వాతా ఫిరాయింపుల‌కు చెప్ప వ‌చ్చేది ఏమిటి అంటే..? వచ్చే ఎన్నిక‌ల్లో దివికి అలాగే మానుగుంట‌కి మాత్ర‌మే ఇక్క‌డ పోటీ అనేది త‌థ్యం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.